సీడెడ్ లో వీర, నైజాంలో వీరయ్య విన్నర్స్

86
- Advertisement -

గోపిచంద్ మలినేని- నటసింహం బాలయ్య బాబు కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ ఈ నెల 12న రిలీజ్ అయ్యింది. రిలీజైన తొలి రోజే 54 కోట్లు గ్రాస్ ను వసూలు చేసి బాలయ్య కెరీర్ లోనే కొత్త రికార్డును నమోదు చేసింది. అలాగే కేవలం నాలుగు రోజుల్లోనే 104 కోట్లకి పైగా వసూలు రాబట్టింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని JRC కన్వెన్షన్ వేదికగా ‘వీరసింహుని విజయోత్సవం’ పేరిట ఈ సెలెబ్రేషన్స్ ను ఆదివారం నిర్వహించనున్నారు. నిజానికి వీరసింహారెడ్డి మొదటి షోతో సూపర్ హిట్ టాక్ ఏమీ తెచ్చుకోలేదు. అయినా, ఈ సినిమాని బాలయ్య అభిమానులు తమ భుజానికెత్తుకున్నారు.

అటు యూఎస్ లోనూ వీరసింహారెడ్డి మోత మోగించింది. యూఎస్ లో మొదటి రోజే ఈ సినిమా $1 మిలియన్ గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసింది. ఇప్పటికీ ఈ సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టే అవకాశం ఉందని మేకర్స్ తెలిపారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు. ఈ సంక్రాంతికి 5 సినిమాలు విడుదలైన.. బాలయ్య సినిమాకు ట్రెమండస్ కలెక్షన్స్ రావడం నిజంగా విశేషమే. ఏదిఏమైనా టాలీవుడ్ స్క్రీన్ మీద ఈ సంక్రాంతి పోటీ మస్త్ కిక్కిచ్చింది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలయ్య ఒక్కరోజు తేడాతో బరిలోకి దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది.

అటు బాలయ్య బాబు – ఇటు మెగాస్టార్ చిరంజీవి సైతం నువ్వా నేనా అన్నట్టున్న టఫ్ ఫైట్ లో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ను రాబట్టారు. దీనికి తోడు రెండు సినిమాలకు సక్సెస్ టాక్ వచ్చింది. దాంతో ఫ్యాన్స్ లో కూడా రెండు సినిమాలపై మరింత హైప్ వచ్చింది. పోటీ అన్నాక ఎవరో ఒకరు గెలవాల్సిందే. అయితే పక్కా లెక్కలు తీస్తే.. వీరసింహారెడ్డి సీడెడ్ లో, వాల్తేరు వీరయ్య నైజాం లో సంక్రాంతి విన్నర్లుగా నిలిచారు.

ఇవి కూడా చదవండి…

ఆ యాంకర్లిద్దరికీ నేడు చేదు జ్ఞాపకం

‘పుష్ప 2’ నేపథ్యం అదే !

వారసుడు ఓటీటీలోకి ఎప్పుడంటే…

- Advertisement -