సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌..ప్రైవేట్ పరం..!

397
secundrabad
- Advertisement -

నిత్యం వేలాది మంది ప్రయాణీకులతో రద్దీగా ఉండే ప్రాంతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా రాజధాని హైదరాబాద్‌కు అప్‌ అండ్‌ డౌన్ చేస్తుంటారు. అలాంటి వారికి వారధిగా నిలిచింది సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌. అందరికి అందుబాటులో ఉండటం,ట్రైన్ టైమింగ్స్‌ కూడా కన్వినెంట్‌గా ఉండటంతో చాలామంది ఇప్పటికి ప్రతిరోజు రాకపోకలు సాగిస్తున్నారు. ఇకపై వారికి ఖచ్చితంగా షాకింగ్ వార్తే.

ఎందుకంటే సికింద్రాబాద్ రైల్వేను ప్రైవేట్ పరం చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రధాన స్టేషన్ల నిర్వహణతో పాటు ప్లాట్ ఫాం టికెట్స్, పారిశుధ్య నిర్వహణ, పార్కింగ్ వంటి సేవల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను ఇప్పటికే ఇండియన్‌ రైల్వే స్టేషన్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఐఆర్‌ఎస్‌డీసీ)కి అప్పగించింది.

స్టేషన్లను ప్రైవేటు సంస్థల చేతుల్లో పెట్టడం వల్ల ఉద్యోగాలు తగ్గిపోవడంతోపాటు ప్రయాణికులపై భారం పడుతుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్న రైల్వేశాఖ ప్రధాన నగరాల్లోని స్టేషన్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలన్న నిర్ణయంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై రైల్వే శాఖ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

- Advertisement -