తెలంగాణలో లోక్ సభ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతుంది. ప్రధాన పార్టీలు ప్రచారంలో బీజీగా ఉన్నాయి. అసలే వలసలతో సతమతమవుతున్నా మరో సమస్య ఎదురైంది. ప్రచారం లో సొంత పార్టీ నేతలే కొట్టుకొవడం చర్చనీయాంశమైంది. ఇదంతా సికింద్రాబాద్ కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్ధి అంజన్ కుమార్ యాదవ్ సమక్షంలోనే ఈగొడవ జరిగింది. ఇద్దరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల వారు ప్రచారంలోనే ఒకరపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకుంటూ కొట్టుకున్నారు. దీంతో అక్కడున్న మిగతా కార్యకర్తలు వారిద్దరిని పక్కకు తీసుకెళ్లారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని లాలాపేట్ లో ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఈ ఘటన జరిగింది. స్టేజి పైన అంజన్ కుమార్ యాదవ్ మాట్లాడుతుండగానే వారిద్దరూ దాడి చేసుకున్నారు. దీంతో సమావేశం అనంతరం ఇద్దరితో మాట్లాడి సముదాయించారు సికింద్రబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధి అంజన్ కుమార్ యాదవ్. ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకుల వలసలతో సతమతమవుతున్న కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి అంతర్గత గొడవల పార్టీకి మరింత నష్టం జరిగే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ప్రత్యర్ధి పార్టీల వారు ప్రచారంలో దూసుకుపోతుంటే.. కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇలాంటి గొడవలు జరుగుతుండటంతో పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.