సికింద్రాబాద్ ఘటనలో వరంగల్ జిల్లా విద్యార్థి మృతి..

115
Damodara Rakesh
- Advertisement -

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అగ్నిపథ్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనకారులు భారీ విధ్వంసం సృష్టించిన తెలిసిందే. ఈ ఘటనలో ఆందోళకారులపై పోలీసులు కాల్పులు జరపగా, ఓ యువకుడు మృతి చెందాడు. ఈ కాల్పుల్లో మరణించిన యువకుడు వరంగల్ జిల్లాకు చెందిన దామోదర రాకేశ్ అని గుర్తించారు. అతనిది నర్పంపేటలోని ఖానాపురం మండలం, దబీర్ పేట గామం.

రాకేశ్ చనిపోవడంతో ఆయన స్వగ్రామంలో విషాదం అలుముకుంది. రాకేష్ ఇంటి దగ్గరకు బంధువులతో పాటు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. మరోవైపు మృతుడి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. రాకేష్ కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ఇక 18 సంవత్సరాల రాకేశ్ నర్సంపేటలో డిగ్రీ చేశాడు. రాకేశ్ తండ్రి కుమారస్వామి రైతు. రాకేశ్‌కు ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. మృతుడి సోదరి ఆర్మీలో పనిచేస్తున్నారు.

కాగా, ఈ రోజు ఉదయం నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌లో తీవ్రస్థాయి ఇంకా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉదయంతో పోల్చితే నిరసనకారుల సంఖ్య కాస్త తగ్గినా, ఇప్పటికీ అక్కడ ఆందోళనకర పరిస్థితి కొనసాగుతోంది.

- Advertisement -