ఘనంగా లష్కర్‌ బోనాలు..

237
- Advertisement -

లష్కర్ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ దంపతులు తొలి బోనం, పట్టువస్ర్తాలు సమర్పించారు. తొలి బోనానికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అర్థరాత్రి 2 గంటల నుంచే అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. రెండు రోజులపాటు నిర్వహించే ఈ బోనాలకు సుమారు 20 లక్షల మంది భక్తులు తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. సికింద్రాబాద్‌లోని జనరల్ బజార్‌లో కొలువుదీరిన అమ్మవారి ఆలయం వద్ద భక్తుల సౌకర్యార్థం తగిన ఏర్పాట్లు చేశారు. బోనాల పండుగకు 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయం పరిసరాల్లో 130 సీసీ కెమెరాలు ఏర్పాటు, షీటీమ్స్, టాస్క్‌ఫోర్స్ బృందాలతో నిఘాను ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు రంగం కార్యక్రమం నిర్వహిస్తారు.

Secunderabad Lashkar Bonalu

- Advertisement -