Secretariat… రేపట్నుంచి శాఖల షిప్టింగ్‌

63
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం మరో వందేళ్లు గుర్తిండిపోయేలా నిర్మించిన నూతన సచివాలయంకు రేపటి నుంచి శాఖలను షిప్ట్ చేయనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి కో-ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. సీఎం కేసీఆర్ ఈ నెల 30న గ్రాండ్‌గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంను ప్రారంభించేందుకు సర్వసన్నద్ధమైంది. అదే రోజు ఉదయం కొత్త సచివాలయం ప్రాంగణంలో సుదర్శన యాగం నిర్వహించనున్నారు. అందుకు తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ ప్రారంభోత్సవం కోసం శాఖల వారిగా బాధ్యతలను సీఎస్ శాంతి కుమారి అప్పగించారు.

Also Read: బీజేపీకి ఆ పార్టీల భయం !

రేపటి నుంచి శాఖలను నూతన భవనంలోకి మార్చనున్నారు. ఈ నెల 28వ తేదీ వరకు శాఖల షిప్టింగ్ ఉంటుంది. ఒక్కో ఫ్లోర్‌కు మూడు శాఖల కేటాయించినట్టుగా తెలిపారు. గ్రౌండ్‌ ఫ్లోర్లో రెవెన్యూశాఖ, మొదటి ఫ్లోర్లో హోం శాఖ, రెండో అంతస్తులో ఆర్థిక శాఖ కార్యాలయాలను కేటాయించినట్టుగా తెలిపారు. అంతే కాదు మూడో ఫ్లోర్లో అగ్రికల్చర్‌ మరియు ఎస్సి డెవలప్ మెంట్, నాలుగవ అంతస్తులో ఇరిగేషన్ అండ్ లా, ఐదవ అంతస్తులో సాధారణ పరిపాలన శాఖలను కేటాయించారు. ఆరో ఫ్లోర్లో సీఎం, సీఎస్ కార్యాలయాలు కేటాయించారు.

Also Read: మోడీ “మన్ కీ బాత్ “.. మౌనమేందుకు జీ !

- Advertisement -