రెండో రోజు పల్స్ పోలియో కార్యక్రమం

3
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా రెండో రోజు పల్స్ పోలియో కార్యక్రమం కొనసాగుతోంది. తొలి రోజే రాష్ట్రంలో 95.1 శాతం అంటే 38,95,550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసింది ఆరోగ్యశాఖ.

నిన్న పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారులకు ఈరోజు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తోంది ఆరోగ్యశాఖ సిబ్బంది. రేపు కూడా ఇంటింటికీ వెళ్లి మిగిలిన చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు వైద్య, ఆరోగ్యశాఖ బృందాలు.

రాష్ట్రంలో 5 ఏండ్లలోపు 40,97,749 మంది చిన్నారులు ఉన్నట్లు అంచనా. వీరిలో తొలి రోజే 38,95,550 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసి 95.1 శాతం కవరేజీ సాధించామని వెల్లడించారు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ.

మిగిలిన చిన్నారులందరికీ ఈరోజు, రేపు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తామని కమిషనర్ తెలిపారు.ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు కమిషనర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మరోసారి విజ్ఞప్తి చేశారు.

Also Read:GIC:తెలంగాణ క్రికెట్‌లో కొత్త అధ్యాయం

- Advertisement -