జంట నగరాల్లో రెండో రోజు గణేష్ నిమజ్జనం కొనసాగుతోంది. ఇప్పటివరకు లక్షకు పైగా గణనాథుల నిమజ్జనం జరిగిందని అధికారులు తెలిపారు. ఇక ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌లో గణనాథుల నిమజ్జన ప్రక్రియ చివరి దశకు చేరుకుంది.
ఆఫీసులు, ఇతర పనులకు వెళ్లే వారు బయటకు రావడంతో ట్యాంక్ బండ్, లిబర్టీ, లక్డీకాపూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు సచివాలయం వద్ద ఉన్న తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పైకి వాహనాల రాకపోకలకు పోలీసులు అనుమతి ఇచ్చారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు వాహనాలను అనుమతించడం లేదు. గణనాథులను నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ వైపు మళ్లిస్తున్నారు.
గతేడాదితో పోలిస్తే మూడు గంటల ముందే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేశామని తెలిపారు సీపీ సీవీ ఆనంద్. నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తులో ఉన్నారని పేర్కొన్నారు.
Also Read:ప్రధాని మోడీ బర్త్ డే..ఒకే చోట 74 మొక్కలు