- Advertisement -
జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దుతో ఏర్పడిన పరిస్థితులు క్రమ క్రమంగా సద్దుమణుగుతున్నాయి. ప్రస్తుతం శాంతియుత వాతావరణం ఉన్న నేపథ్యంలో జమ్మూలో 144 సెక్షన్ ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు డిప్యూటీ మేజిస్ట్రేట్. నేటి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభించాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కశ్మీర్లో మాత్రం 144 సెక్షన్ కొనసాగనుంది.
శుక్రవారం ప్రార్థనలు చేసుకొనేందుకు కశ్మీర్ లోయలో ప్రజలకు మసీదులకు వెళ్లేందుకు అనుమతినిచ్చినట్లు డీజీపీ మునీర్ ఖాన్ తెలిపారు. కశ్మీర్ ప్రజలను ఇబ్బందులకు గురి చేయకుండా పరిస్థితి చక్కదిద్దాలని అధికారులకు సూచించారు.
ఉత్తర కశ్మీర్లోని సోపోర్ పట్టణంలో మాత్రం చిన్నపాటి ఘర్షణ జరిగిందని, ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో వెంటనే దీన్ని అదుపులోకి తెచ్చినట్లు ఓ వార్తా సంస్థ వెల్లడించింది.
- Advertisement -