‘సెబాస్టియన్ PC 524’ ట్రైలర్‌ వచ్చేసింది..

46
- Advertisement -

కిరణ్ అబ్బవరం హీరోగా ‘సెబాస్టియన్ PC 524’ సినిమా రూపొందింది. జ్యోవిత – ఎలైట్ సంస్థలు ఈ సినిమాను నిర్మించాయి. ఈ సినిమాతో దర్శకుడిగా బాలాజీ సయ్యపురెడ్డి పరిచయమవుతున్నాడు. కథానాయికగా ‘నువేక్ష’ తెలుగులో చేస్తున్న ఫస్టు మూవీ ఇది. మార్చి 4వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రీ-రిలీజ్ వీడియోలు, పాటలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని రేపాయి.ఈ నేపథ్యంలో సోమవారం ట్రైలర్ వదిలారు.

ఈ సినిమాలో హీరో పోలీస్ కానిస్టేబుల్.. రేచీకటితో ఇబ్బంది పడుతుంటాడు. తనకి నైట్ షిఫ్టులు వేయవద్దని బాస్‌ను బ్రతుమలాడుకుంటూ ఉంటాడు. ఆయన వినకపోతే.. తన డ్యూటీ చేసి పెట్టమని మిగతా పోలీస్ లను రిక్వెస్ట్ చేసుకుంటూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఆయన ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. రోజులు బాగానే గడిచిపోతున్నాయని అనుకునే సమయంలోనే అతను నైట్ డ్యూటీ చేయవలసి వస్తుంది. ఆ రాత్రి అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పిందనేదే కథ. ఆసక్తికరమైన ట్విస్టులతో పాటు, కామెడీ కూడా కావాల్సినంత ఉందనే విషయం అర్థమవుతోంది. ఇక హీరోయిన్ గ్లామర్.. రొమాన్స్ కూడా ఈ సినిమాకి కలిసి వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -