టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం ‘సెబాస్టియన్ పిసి 524’. ఈ మూవీ మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈమేరకు సెన్సార్ బృందం యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. ఈ సినిమాలో కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లుగా నటించారు. జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు.
బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. కాగా, ‘రాజావారు రాణిగారు’ సినిమాతో టాలీవుడ్‌కు హీరోగా పరిచయమైన కిరణ్ అబ్బవరం, తొలి సినిమాతో తనకంటూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఆతరువాత రెండో చిత్రం ‘ఎస్.ఆర్. కళ్యాణమండపం’తో మంచి హిట్ అందుకున్నారు. ఇక ఇప్పుడు ‘సెబాస్టియన్ పిసి 524’తో హ్యాట్రిక్ హిట్ అందుకోవడానికి రెడీ అవుతున్నారు.
