ఆకట్టుకుంటున్న #SDGM ఫస్ట్ లుక్

3
- Advertisement -

బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ యాక్షన్ హీరోగా నాలుగు దశాబ్దాల తన సక్సెస్ ఫుల్ కెరీర్‌లో100 మైల్ స్టోన్ మూవీకి చేరువయ్యారు. రీసెంట్ బ్లాక్ బస్టర్ గద్దర్ 2 తో అలరించిన సన్నీ డియోల్, ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో అలరించే మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో చేతులు కలిపారు. ఈ కొలాబరేషన్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతోంది.

మైత్రీ మూవీ మేకర్స్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వప్రసాద్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి “జాత్” అనే పవర్‌ఫుల్ టైటిల్ ఖరారు చేశారు. సన్నీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ సన్నీ డియోల్‌ను పవర్ ఫుల్, ఇంటెన్స్ అవతార్‌లో ప్రజెంట్ చేసింది, ఈ యాక్షన్-ప్యాక్డ్ మూవీ నుండి ప్రేక్షకులు ఏమి ఆశించవచ్చో టోన్ ని సెట్ చేస్తుంది. సన్నీ డియోల్ తన శరీరమంతా బ్లడ్ మార్క్స్ తో మ్యాసీవ్ ఫ్యాన్‌ని పట్టుకుని ఉన్న పోస్టర్ హై-ఆక్టేన్ డ్రామా, లార్జర్-దేన్-లైఫ్ యాక్షన్ సీక్వెన్స్ లని సూచిస్తుంది.

“జాత్” చిత్రంలో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్, సయామి ఖేర్, రెజీనా కసాండ్రా కీలక పాత్రలలో నటిస్తున్నారు.ఈ సినిమాకి టాప్ నాచ్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. సెన్సేషనల్ కంపోజర్ థమన్ ఎస్ మ్యూజిక్ అందిస్తున్నారు, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తుండగా, నవీన్ నూలి ఎడిటర్, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. యాక్షన్ కొరియోగ్రాఫర్లు పీటర్ హెయిన్, అన్ల్ అరసు, రామ్ లక్ష్మణ్ వెంకట్‌ బ్రెత్ టేకింగ్ స్టంట్స్ ,యాక్షన్ సీక్వెన్స్‌లను అందిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈరోజు 4:05 గంటలకు సినిమా మోషన్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు.

Also Read:శ్రీవారి ధ్వజస్తంభం వెనుక ఉన్న కథ మీకు తెలుసా?

- Advertisement -