- Advertisement -
రేషన్ కార్డు లబ్దిదారులకు కేంద్రం గట్టి షాక్ ఇచ్చింది. ఆధార్ కార్డుతో అనుసంధానం కానీ మూడు కోట్ల రేషన్ కార్డులను రద్దు చేసి కొలుకోలేని దెబ్బతీసింది. దీంతో ఇప్పటివరకు లబ్దిదారులకు అంతో ఇంతో బాసటగా నిలిచిన రేషన్ వ్యవస్థ ఇకపై అందదని తెలిసి కేంద్రం తీరుపై మండిపడుతున్నారు.
ఇక కేంద్రం తీసుకున్న నిర్ణయంపై తీవ్రంగా స్పందించింది సుప్రీం కోర్టు. రేషన్ కార్డులను రద్దు చేసిన విషయాన్ని చులకనగా చూడవద్దు అని, దీన్ని సీరియస్‌గా తీసుకుని చర్యలు చేపట్టాలని పేర్కొంది. ప్రభుత్వ చర్య దారుణంగా ఉందని దీనిపై కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని సుప్రీం పేర్కొంది.చీఫ్ జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బొప్పన్నా, వీ సుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
- Advertisement -