చైనా సదరన్ ఎయిర్‌లైస్స్ కు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. సెల్‌ఫోన్ చార్జింగ్ కు వాడే పవర్ బ్యాంకు ఒక్కసారిగా పేలిపోయింది. ఓవర్ హెడ్ కంపార్ట్‌మెంట్2లో ఉంచిన ఓ బ్యాగులోని పవర్ బ్యాంక్ పేలిపోయి, ఆ బ్యాగులో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దాంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే అగ్నిమాపక యంత్రాలకు బదులుగా వైమానిక సిబ్బంది బాటిళ్లలోని నీళ్లను జల్లి మంటలను ఆర్పారు.
ఈ ఘటనపై చైనా సదరన్ వెంటనే స్పందించనప్పటికీ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగినప్పుడు పవర్ బ్యాంకు వినియోగంలో లేకపోయినా ఎందుకు పేలిందనే దానిపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఆ బ్యాగు తీసుకువచ్చిన వ్యక్తిని విచారిస్తున్నారు. ఈ ఘటనతో ఆ విమానాన్ని నిలిపివేసి మరో విమానంలో ప్రయాణికులను పంపించారు.
బోయింగ్ 777-300ఈఆర్ విమానంలో కొంత భాగం మాత్రం పాడైంది. కాగా..మంటలు చెలరేగినప్పుడు ప్రయాణికుడు తీసిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
Power bank fire on board China Southern CZ3539, Feb 25 2018.😱😱 pic.twitter.com/cby6E62qRv
— ChinaAviationReview (@ChinaAvReview) February 25, 2018