హైదరాబాద్ నగరంలోని DGP కార్యాలయంలో డీజీపీ మహేందర్ రెడ్డిని కమిషన్ చైర్మన్ శ్రీ.డా.ఎర్రోళ్ల శ్రీనివాస్,సభ్యులు శ్రీమతి నీలదేవి,విద్యాసాగర్ ,సుంకపాక దేవయ్య,యం. రంబాల్ నాయక్ బృందం కలిశారు.ఈ సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రతి నెల 30 తేదీ న సివిల్ రైట్స్ డే ఎమ్మెల్యే లు,ప్రజాప్రతినిధులు, అధికారులతో నిర్వహిస్తున్నామన్నారు.. గతంలో సివిల్ రైట్స్ డే ఎప్పుడో ఒక్కసారి జరిగేది. కానీ కమిషన్ ఏర్పడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా 90 శాతం మండలాల్లో జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమం ఇంకా విజయవంతంగా జరిపే ప్రయత్నం లో సివిల్ రైట్స్ డే పాల్గొనాలని సీఎస్ గారిని కలిశాము. అలాగే మీరు కూడా పాల్గొనాలి అని కమిషన్ బృందం కోరారు. సీఎస్ మరియు డిజిపి లు సివిల్ రైట్స్ డే లో పాల్గొంటే ఆ స్ఫూర్తితో కింది స్థాయి అధికారులు కూడా పాల్గొంటారు అని తెలియజేశారు.
కమిషన్ ఏర్పడిన తర్వాత కమిషన్ చేపడుతున్న కార్యక్రమాలను తెలుసుకుంటున్నాను అని రాష్ట్రం లో అంటరానితనం నిర్మూలన కోసం మీరు చేపట్టిన కార్యక్రమాలు చాలా బాగున్నాయి అని అలాగే సివిల్ రైట్స్ డే కార్యక్రమంలో పాల్గొంటానని డీజీపీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రంబాల్ నాయక్, సుంకపాక దేవయ్య, బోయిల్ల విద్యాసాగర్, పెందూర్ నీలదేవి గార్లు పాల్గొన్నారు.