స్పీకర్‌ నిర్ణయం తర్వాత తుది తీర్పు..రాజీనామాలపై సుప్రీం

415
karnataka mlas
- Advertisement -

కర్ణాటక రాజకీయాలు క్షణం క్షణం ఉత్కంఠను రేపుతున్నాయి. తమ రాజీనామాలపై స్పీకర్ స్పందించడం లేదంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్‌ను విచారించింది సుప్రీం. సాయంత్రం 6 గంటలకు స్పీకర్‌ను కలవాలని సూచించిన న్యాయస్ధానం ఎమ్మెల్యేల వాదనను వినాలని స్పీకర్‌ను ఆదేశించింది.

ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు ఇవ్వాలని కోరింది సుప్రీం. స్పీకర్ ఉత్తర్వులపై రేపు విచారణ చేస్తామని రాజీనామా చేసిన ఎమ్మెల్యేలందరికీ తగిన భద్రత ఇవ్వాలని కర్ణాటక డీజీపీని ఆదేశించింది.

అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామాల్లో కొన్ని సరిగా లేవంటూ స్పీకర్‌ రమేశ్ కుమార్‌ ఎమ్మెల్యేల రాజీనామాలను పెండింగ్‌లో పెట్టారు. సరైన ఫార్మాట్‌లో రాజీనామాలు ఇవ్వాలని స్పీకర్ తెలపడంతో రెబల్‌ ఎమ్మెల్యేలు సుప్రీంను ఆశ్రయించారు.

- Advertisement -