ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం మ‌న‌దే: రేవంత్

11
- Advertisement -

ఎస్సీ వర్గీకరణ చేసిన తొలి రాష్ట్రం మనదేనని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు శాసనసభ అమోదం తెలిపిన నేపథ్యంలో ఎస్సీ సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం.. తరతరాలుగా ఎస్సీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. దేశంలో బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ ఎస్సీ వర్గీకరణ జరగలేదని గుర్తు చేశారు.సీఎంగా మీ వాడే ఉన్నాడని భావించాలని, ఎస్సీ కులాల సంక్షేమం, అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి మరింత ధైర్యం చెప్పారు.

ఎవరికీ అన్యాయం జరగకుండా వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేస్తామని భరోసానిచ్చారు. ఎన్నో ఏళ్ల చిక్కుముడికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పరిష్కారం చూపించామంటూ ఆయన సంతోషం వ్యక్తం చేశారు. దామోదర రాజనర్సింహ కేబినెట్ సబ్ కమిటీ ఛైర్మన్ తీసుకో అంటే నాకు వద్దు అన్నారు.. నా పనే నేను ఎక్కువ చేసుకున్న అనుకుంటారు అని వద్దన్నారు అన్నారు.

మీకు సహనం ఎక్కువ.. పదేళ్లు వేచి చూశారు.. నాకు అవకాశం ఇచ్చారు.. సుప్రీంకోర్టులో కేసులు వాయిదా పడుతున్నాయి.. అందుకే నేనే మంచి అడ్వకేట్ ను పెట్టీ పంపిన.. మందకృష్ణతో నాకేం విభేదం లేదు.. కానీ ఆయన నా కంటే… కిషన్ రెడ్డిని ఎక్కువ నమ్ముతున్నాడు అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు అమలు చేయలేదు.. మీ జాతికి న్యాయం చేయాలని అనుకున్న.. బిల్లుకు ప్రాసెస్ ఉంటది.. అందుకే పకడ్బందీగా చేశాం అన్నారు రేవంత్.

- Advertisement -