నిర్బయ నిందితుల రివ్యూ పిటిషన్‌పై విచారణ

527
nirbaya case
- Advertisement -

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ నిందితుల రివ్యూ పిటిషన్‌పై నేడు సుప్రీం విచారించనుంది. ఇప్పటికే నిందితులకు వేసిన ఉరిశిక్షను సుప్రీం సమర్ధించింది. అయితే ఢిల్లీలో కాలుష్యవాతావరణం, కలుషిత నీటి కారణంగా ఆయుర్ధాయం తగ్గిపోతోందని.. ఈ నేపథ్యంలో తమకు ఇంక ఉరి శిక్ష వేయాల్సిన అవసరం ఏముందని నిర్భయ నిందితుల్లోని వినయ్ శర్మ కోర్టును ఆశ్రయించారు.

సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. ఇక నిందితులకు డెత్ వారెంట్ అమలు చేయాలంటూ నిర్బయ తల్లిదండ్రులు కూడా కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలో రివ్యూ పిటిషన్ విచారణ తర్వాత ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది సుప్రీం.

ఇక నిర్బయ కేసు డిటైల్స్ పరిశీలిస్తే…

()డిసెంబర్ 16, 2012 23 ఏళ్ల పారామెడికల్‌ విద్యార్థినిపై ఆరుగురి అత్యాచారం
()జనవరి 28, 2013 ఆరో నిందితుడిని మైనర్‌గా విచారించాలని జువైనల్‌ బోర్డు ఆదేశం
()మార్చి 11, 2013 ప్రధాన నిందితుడు రామ్‌సింగ్ తీహార్‌ జైల్లో ఆత్మహత్య
()ఆగస్టు, 2013 మైనర్‌ను మూడేళ్లు రిఫార్మ్‌ హోంలో వేయాలని ఆదేశం
()సెప్టెంబర్ 13, 2013 నలుగురు నిందితులకు ఉరిశిక్ష విధించిన ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు
()మార్చి 13, 2014 ఉరిశిక్షను సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
()జూన్, 2014 హైకోర్టు ఆర్డర్‌కు వ్యతిరేకంగా సుప్రీంలో ఇద్దరు దోషుల పిటిషన్
()డిసెంబర్ 13, 2015 మూడేళ్ల జైలు శిక్ష తర్వాత రిఫార్మ్ హోం నుంచి మైనర్‌ విడుదల
()ఆగస్టు, 2016 దోషి వినయ్‌ శర్మ ఆత్మహత్యాయత్నం
()మే 5, 2017 నలుగురి ఉరిశిక్షను సమర్థించిన సుప్రీం కోర్టు
()మే 5, 2017 ఉరిశిక్షను సవాల్‌ చేస్తూ ముగ్గురి దోషుల రివ్యూ పిటిషన్
()జులై 9, 2018 ఉరిశిక్షను సమర్థిస్తూ సుప్రీం కోర్టు తీర్పు

- Advertisement -