జస్టిస్ లోయా మృతిపై అనుమానాలు లేవు..

251
SC Dismisses Petition Seeking Probe Into Judge Loya's Death
- Advertisement -

జస్టిస్ లోయా మృతిపై సిట్ విచారణ జరిపించాలన్న పిటిషన్‌ను త్రోసిపుచ్చింది సుప్రీం కోర్టు. లోయా మృతిపై స్వతంత్ర్య దర్యాప్తు సంస్థతో విచారణ జరపాలన్న పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం.. ఎలాంటి అనుమానాలు లేవని …విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని తెలిపింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రాబుద్దీన్ షేక్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో లోయా అనుమానాస్పద స్ధితిలో మృతి చెందారు. నాగపూర్‌లో తన సహచర ఉద్యోగి కుమార్తె పెళ్లికి వెళ్లినప్పుడు 2014 డిసెంబర్ 1న గుండెపోటుతో మరణించారు. లోయా మృతి అనుమానాస్పదంగా ఉందని, దీనిపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఎ.ఎం.ఖాన్వల్కర్, డివై చంద్రచూడ్‌లతో కూడిన బెంచ్ గత మార్చి 16న తీర్పు రిజర్వ్ చేసింది.

కొందరు లోయా మృతిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టు ముందు తన వాదన వినిపించింది. తన తండ్రిది సహజమరణమేనని లోయా కుమారుడు ఈ ఏడాది జనవరి 14న ముంబైలో మీడియాకు చెప్పారు. దీంతో సోహ్రాబుద్దీన్ షేక్ బూటకపు ఎన్‌కౌంటర్ కేసులో నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న అమిత్‌షా, రాజస్థాన్ హోం మంత్రి గులాబ్ చంద్ కటారియా, విమల్ పట్ని, గుజరాత్ మాజీ పోలీస్ చీఫ్ పీసీ పాండే, అడిషనల్ డీజీపీ గీతా జోహ్రా నిర్దోషులుగా బయటపడ్డారు. ఈ నేపథ్యంలో లోయా మృతిపై అనుమానాలు లేవని సుప్రీం తెలిపింది.

- Advertisement -