నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. ఈ కేసులోని నలుగురు దోషులకు ఢిల్లీ కోర్టు ఉరిశిక్షను విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తమకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని కోరుతూ చివరి ప్రయత్నంగా నలుగురు దోషుల్లోని ఇద్దరు వినయ్ శర్మ, ముఖేశ్ సుప్రీంకోర్టులో మెర్సీ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వారి పిటిషన్లను కొట్టివేసింది.
నలుగురు దోషులైన ముఖేశ్ సింగ్, పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్ లను ఈనెల 22న ఉదయం 7 గంటలకు తీహార్ జైల్లో ఉరితీయనున్నారు. ఈ కేసులో ఐదో దోషి అయిన రామ్ సింగ్ 2013 మార్చ్ నెలలో జైల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇక తీర్పు వెలువడిన అనంతరం నిర్భయ తల్లి ఆశాదేవి మీడియాతో మాట్లాడారు. జనవరి 22 తన జీవితంలో మరిచిపోలేనిదని.. గత 7 ఏళ్లుగా మేము అనుభవిస్తున్న భాద వర్ణణాతీతమమని ఆమె తెలిపారు. ఆ నరరూప రాక్షసులకు ఉరిశిక్ష ఖరారవడంతో న్యాయం ఇంకా బతికే ఉన్నట్లు నిర్భయ తల్లి ఆశాదేవి తెలిపారు.