హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు షాకిచ్చింది సుప్రీం కోర్టు. హెచ్‌సీఏను రద్దు చేసింది సర్వోన్నత న్యాయస్థానం. మాజీ జడ్జ్ లావు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేసింది. ఇకపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వ్యవహారాలను కమిటీ చూసుకుంటదని వెల్లడించింది న్యాయస్ధానం. పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నిర్వహణ ప్రక్రియను జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు పర్యవేక్షిస్తారని వెల్లడించింది.
ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగాలన్న సుప్రీంకోర్టు ధర్మాసనం..హెచ్‌సీఎకు సంబంధించిన అన్ని నిర్ణయాలు తదుపరి చర్యలు లావు నాగేశ్వరావు చూసుకుంటారని వెల్లడించింది. జస్టిస్ నాగేశ్వరావు కమిటీ నివేదిక ప్రకారం తదుపరి ఆదేశాలు ఇస్తామని తెలిపింది సర్వోన్నత న్యాయస్థానం. తదుపరి విచారణను మార్చి 2కి వాయిదా వేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ఎస్.కె. కౌల్, జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ అరవింద్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఇవి కూడా చదవండి..