నేటి నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) దేశవ్యాప్తంగా ఛార్జీల బాదుడు నేటి నుంచే మొదలుపెట్టింది. ఇకపై బ్యాంకులో ప్రతి నెలా తొలి నాలుగు లావాదేవీలు మాత్రమే ఖాతాదారులకు ఉచితం. ఆపై జరిపే ప్రతి లావాదేవీపై రూ.50 సేవా పన్నును ఎస్బీఐ వసూలు చేనుంది.
ఎస్బీఐ ఏటీఎంను 5 సార్లు ఉచితంగా ఉపయోగించవచ్చు. ఆ తర్వాత ప్రతి లావాదేవీకి రూ. పది చొప్పున వసూలు చేస్తారు. ఇతర బ్యాంకు ఏటీఎం అయితే ఉచితంగా 3 సార్లు వినియోగించుకోవచ్చు. పరిమితి దాటితే ప్రతి లావాదేవీకి రూ.20 వసూలు చేస్తారు.
ఆన్లైన్ ట్రాన్సాక్షన్లపై కూడా అదనపు చార్జీలను వసూలు చేయనుంది. ఐఎంపీఎస్, యూపీఐ, ఐయూఎస్ఎస్డీల ద్వారా రూ.లక్ష వరకు లావాదేవీలపై సేవా పన్ను కాక అదనంగా రూ.5 చెల్లించాల్సిందే. రూ. లక్ష నుంచి 2 లక్షల మధ్య లావాదేవీలపై రూ.15, రూ.2 లక్షల నుంచి 5లక్షల లావాదేవీలపై రూ.25 అదనంగా వడ్డించనుంది. ఇదిలా ఉండగా, చిరిగిన నోట్ల మార్పిడిపై కూడా బ్యాంకులు అదనపు చార్జీలు వసూలు చేయనున్నాయి. అలాగే నెలకు రూ.50 వేలకు మించి చెల్లింపులు జరిపే వారి నుంచి 5 శాతం టీడీఎస్ వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.