భారతీయ స్టేట్ బ్యాంక్ సంచలన నిర్ణయం తీసుకుంది. సేవింగ్ ఖాతాల్లో కనీస నిల్వలు పాటించని కస్టమర్లకు విధించే పెనాల్టీ చార్జీలను 70 శాతం వరకు తగ్గించింది. ఎస్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో 25 కోట్ల మంది ఖాతాదారులకు ఊరటనిచ్చింది.
అయితే ఎస్‌బీఐ సవరించిన చార్జీలు వచ్చేనెల 1నుంచి అమల్లోకి రానున్నాయి. ఎస్బీఐ తాజా నిర్ణయంతో మెట్రో,అర్బన్ కేంద్రాల్లో ప్రస్తుతం విధిస్తున్న చార్జీలు రూ.50 నుంచి రూ.15కు తగ్గనున్నాయి. సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటి వరకు రూ.40 వరకు నాన్ మెయింటనెన్స్ చార్జీలు విధిస్తున్నారు.
అయితే తాజాగా సెమీ అర్బన్ కస్టమర్లకు రూ.12, గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వరకు చార్జీలు విధించనున్నారు. ఇక ఈ చార్జీలకు యధావిధిగా జీఎస్టీ అదనంగా ఉంటుంది.
ఇప్పటికే బ్యాంక్ లాభాల ద్వారా వచ్చే ఆదాయం కంటే..పెనాల్టీ చార్జీల ద్వారా వచ్చే ఆదాయమే ఉన్నట్టు వెలుగు చూడడంతో ఎస్బీఐ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. విద్యార్థులు,నిరుపేదలకు చెందిన ఖాతాలను సైతం రెగ్యులర్ సేవింగ్స్ ఖాతాలుగా పరిగణించడంతో భారీగ నష్టపోతున్నారు.
ఈనేపథ్యలో కస్టమర్ల నుంచి వస్తున్న సూచనలు, మనోభావాలను దృష్టిలో పెట్టుకుని చార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ఎస్బీఐ. రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంకు ఖాతా నుంచి ఎటువంటి చార్జీలు పడకుండా ఉండే బేసిక్ సేవింగ్స్ ఖాతాల్లోకి మారేందుకు కూడా కస్టమర్లకు అవకాశం కల్పించనున్నట్టు ప్రకటించింది