- Advertisement -
వడ్డీ రేట్ల పెంపుపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. హోమ్‌లోన్లపై వడ్డీ రేటును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకూ అతి తక్కువ వడ్డీ రేటు (6.7 శాతం)కు హోమ్‌లోన్ అందించిన ఎస్‌బీఐ.. ఆ గడువు ముగియడంతో వడ్డీరేటును 6.95 శాతానికి పెంచింది.
పెరిగిన కొత్త వడ్డీరేట్లు ఏప్రిల్ 1 నుంచే అమల్లోకి వస్తాయని ఎస్బీఐ వెల్లడించింది. వడ్డీ రేటు పెంచడమే కాదు.. ఇక నుంచీ అన్ని హోమ్‌లోన్లపై ప్రాసెసింగ్ ఫీజు కూడా వసూలు చేయనున్నట్లు బ్యాంకు స్పష్టం చేసింది. సాధారణంగా కనిష్ఠంగా రూ.10 వేలు, గరిష్ఠంగా రూ.30 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. ఇంత వరకూ ఎస్‌బీఐను చూసి వడ్డీ రేట్లు తగ్గించిన ఇతర బ్యాంకులు ఇప్పుడు వడ్డీరేటును పెంచే అవకాశాలు ఉన్నాయి.
- Advertisement -