డాన్స్‌తో అదరగొట్టేసింది..!

287
Sayyeshaa Saigal Stunning Dance
- Advertisement -

అక్కినేని అఖిల్ డెబ్యూ మూవీ ”అఖిల్” సినిమా చూసిన వాళ్లకి సాయేషా సైగల్ గుర్తుండే ఉంటుంది. ఇక ఆ తరువాత హిందీలో చేసిన ‘శివాయ్’లోను అక్కడి కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అలాంటి సాయేషా ఇప్పుడు తమిళంలో ‘వనమగన్’ సినిమాలోజయం రవి సరసన కథానాయికగా చేస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక వీడియో సాంగ్ ను వదిలారు. ఈ సాంగ్ లో ఈ సుందరి వేసిన స్టెప్స్ చూసి అంతా షాకౌతున్నారు. పలువురు డాన్సర్లు ముక్కు మీద వేలువేసుకున్నారు. ఆ పాటలో శయేషా నర్తించిన తీరు టాప్ డాన్సర్ లుకు తోటి హీరోయిన్లు కు బెదరగొట్టేలా తాండవం చేసింది.

‘ఇంతలో ఎంత మార్పు’ అనుకునేలా డాన్స్ లో ఈ చిన్నది రెచ్చిపోయింది. ప్రభుదేవా కొరియోగ్రఫీని అందించిన ఈ పాటకి .. అవలీలగా ఈ అమ్మాయి డాన్స్ చేసిందని చెబుతున్నారు. చిన్నప్పటి నుంచి డాన్స్ నేర్చుకోవడం వల్లనే ఈ రేంజ్ లో చేయగలిగిందని సన్నిహితులు చెబుతున్నారు. అఖిల్ సినిమాతో మెరవలేకపోయనా.. ఈ డాన్స్‌తో మాత్రం అదరగొట్టేసింది సాయేషా. కాగా, ఈ సినిమాకు సంగీతం హరీశ్ జయరాజ్ అందించాడు. జూన్ 23 న సినిమా విడుదల కాబోతుంది.

- Advertisement -