నవంబర్‌లో నాగచైతన్య “సవ్యసాచి”..

329
- Advertisement -

“ప్రేమమ్” లాంటి సెన్సిబుల్ లవ్ ఎంటర్ టైనర్ అనంతరం నాగచైతన్య-చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ “సవ్యసాచి” చిత్రాన్ని నవంబర్ 2న విడుదల చేయనున్నారు. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మాధవన్, భూమికలు కీలకపాత్రలు పోషిస్తుండడం విశేషం. ఒక పాట మినహా “సవ్యసాచి” షూటింగ్ పూర్తయ్యింది.

Savyasachi Movie Release Date

“రంగస్థలం” అనంతరం మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ మీద ప్రేక్షకులకు విశేషమైన నమ్మకం ఏర్పడింది. అందుకే నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరిలు తమ సంస్థ నుంచి రాబోతున్న తదుపరి చిత్రాల విషయంలో విశేషమైన జాగ్రత్తలు తీసుకొంటున్నారు. హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్‌తో ఈ ఏడాది మాత్రమే కాదు ఎప్పటికీ తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తామని మాట ఇస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్.

- Advertisement -