మీకు అండగా నేను ఉంటా.. ప్రజలే మాకు బాస్‌లు- సీఎం కేసీఆర్

48
kcr

ఎన్నికల చాలా జరుగుతూ ఉంటాయి, ఎన్నికల సందర్భాలు వస్తూ ఉంటాయి. ప్రజలు ఓట్లు వేసే ముందు ఆలోచన చేయాలని సీఎం కేటీఆర్‌ అన్నారు. ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్‌ జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పుడు ఆలోచన చేయాలి. ఎందుకంటే మంచి పనులు చేసినప్పుడు ఇంకా ముందు కు పోవాల్సిన అవసరం ఉంది. మన హైదరాబాద్ నగరం చాలా చరిత్ర ఉన్న నగరం. నేను చెప్పేవి అన్ని సాక్షి భూతం ఉన్నటివంటి ముచ్చట్లు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు అంధకారం అవుతుంది అని కొంత మంది.. మీకు పాలన రాదు అని కొంత మంది.. మరికొంత నక్సలైట్లు వస్తారు అని అన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం సాదించుకున్నం. తెలంగాణ వచ్చాక అవన్నీ పటాపంచలు అయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి అధికారం కట్టబెట్టారు. తెలంగాణలో కేసీఆర్ ప్రసంగాలు అంటే వేచి చూచేవారు. దేశంలో చరిత్రలో నిలిచే సభలు మనం పెట్టుకున్నం అని సీఎం వ్యాఖ్యానించారు.

6,7 యేండ్లు ఎంతో గంభీరంగా మా ప్రభుత్వం పని చేసి చూపించిందో మీ ముందు ఉంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ అభివృద్ది చేసుకున్నాం.దేశం నలుమూలల నుండి వచ్చిన వారిని కడుపులో పెట్టుకొని కపడుకున్నాం. అందరిని అక్కున చేర్చుకున్నం,7 ఏండ్లలో కరెంట్ ఏ విధంగా ఉందో మీకు తెలుసు అందరి అంచనాలను తలకిందులు అయింది. వెలుగుజీలుగుల హైదరాబాద్ కావాలని 6 నెలల్లో అది అదిరోహించాం. ఎవరి ఇంటికి వెళ్లిన పెట్రోల్ ,డీజిల్ వాసన ఎక్కడకుపోయిన కరెంట్ కట్ కానీ 7 ఎండ్లలో ఎక్కడ కూడా అలాంటి ఇబ్బందులు లేకుండా చేశాము. దేశంలోనే ఎక్కువ కరెంట్ వినియోగం ఉన్న రాష్ట్ర ప్రభుత్వంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేను దీన్ని గర్వంగా చెప్తున్న అని సీఎం అన్నారు. నగరంలో కాలనీ లలో ఎక్కడ నీళ్లు కొట్లాటలు లేవు ,ఒకప్పుడు బిందెలు లతో కొట్లాటలు అయ్యేయి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 24 గంటల మంచి నీటి సరఫరా చేస్తాం. ఇప్పటికే దీనిపై కమిటీ వేశాం. నగర ప్రజలకు ఇప్పటికే వరం ఇవ్వడం జరిగింది. నేను బంజారాహిల్స్ లో ఉన్నప్పుడు మైక్ లు పెట్టుకొని నల్ల బిల్లు కట్టాలని కోరే వారు అప్పుడు నేను ఉద్యమంలో ఉన్నాను తెలంగాణ వస్తే త్రాగు నీరు ఉచితంగా ఇవ్వాలని చెప్పాను సీఎం గుర్తు చేశారు.

రాష్ట్రంలో ఇప్పటికే ప్రాజెక్ట్ పూర్తి అయ్యాయి. అపార్ట్మెంట్ లలో ఉన్న వాళ్లకు కూడా 20 వేల నీటి పథకం అందజేస్తాం.పల్లె ప్రగతి దేశంలో ఎక్కడ లేదు దీనితో అద్భుతమైన ప్రగతి సాధించింది. కేసీఆర్ కిట్ సూపర్ హిట్.. రైతు బంధు దేశంలో ఎక్కడైనా ఉందా.. రాష్ట్రంలో ఉన్న రైతు ప్రతి ఒక్కరికి ఇస్తున్ననని మనవి చేస్తున్న..రైతు చనిపోతే రైతు భీమా ఎక్కడైనా ఉందా.. కేవలం5 రోజుల్లో వారికి 5 లక్షలు అందజేస్తోంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అలాగే బస్తి దవాఖాన లు ఎక్కడ అయిన ఉన్నాయా…హైదరాబాద్ నగరంలో ఉంది. ప్రతి కుల వృత్తులను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం టీఆరెస్ ప్రభుత్వం. రజకులను ఆదుకోవాలని కోరారు అందుకే ఈ మధ్యనే ధోభీ ఘాట్ లలో ఉచిత కరెంట్ అందిస్తుంది. గొల్ల కూర్మలకు గొఱ్ఱెలను అందిస్తున్నాం ఇంకా కొంత మందికి రావాలి కచ్చితంగా ఇస్తాం. నాయి బ్రాహ్మణులకు కమర్షియల్ నుండి డొమెస్టిక్ కావాలని కోరారు వారికి కూడా ఉచితంగానే విద్యుత్ అందిస్తున్నాం. కరోనా వచ్చిన ఎక్కడ కూడా సంక్షేమం ఆగలేదు కరోనా కాలంలో ఇంకా ఎక్కువనే బియ్యం పంపిణీ చేశాము. నగరం ఆశస్త్రీయంగా పెరిగింది ఇది ఎవరి వలన అని నేను నిందించను ఎందుకంటే వాళ్ళు వీళ్ళు ఒక్కరే కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక అనేక సంస్కరణలు చేశాము ఇంకా చేసుకోవాలని కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్ నగరం వరదల్లో ఇబ్బందులు పడుతుంది. దానికి శాశ్వత పరిష్కారం కావాలి అంటే 10 కోట్లు కావాలి. హైదరాబాద్ నగరంలో కాలుష్యం తగ్గించేందుకు ఎలక్ట్రానిక్ వెహికిల్ లకు రాయితీలు ఇచ్చము. హైదరాబాద్ నగరంలో పచ్చదనం పెరగాలి దానికోసమే ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్తున్న..మూసి నది ఆగం అయింది దాన్ని సుందరికరణ చేయాల్సిన బాధ్యత నాపై ఉంది చేసి తిరుతాం. హైదరాబాద్ నగరంలో వరదలు వస్తే మా మంత్రులు ఎమ్మెల్యే లు మోకాళ్ళ నీళ్ల లోతులో తిరిగారు. వాళ్ళను చూస్తే దుఃఖం వచ్చింది నాకు దరఖాస్తులు పెట్టుకోలేదు.. వరద సాయం ఎవరు అడగలేదు కానీ దసరా పండుగ ఉందని 6లక్షల 50 వేల మందికి ఇచ్చము. కొంత మంది కొడుకులు అడ్డుకున్నారు. కానీ ఎన్నికలు ముగిశాక అర్హులైన వారికి వరద సాయం ఇస్తాం ఇచ్చి తిరుతాం. భాద ఏంది అంటే వాన వలన మేము నష్టపోయాం ప్రధాన మంత్రిని 1350 కోట్లు ఇవ్వమని అడిగం ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఎందుకు ఈ వివక్ష.. గి మున్సిపల్ ఎన్నికలకు గింత మంది ఎందుకు ఇక్కడ ఎం ఎన్నికలు జరుగుతున్నాయి నేషినల్ ఎన్నికల వరద లాగా వస్తున్నారు. ఒక్క బక్క కేసీఆర్ డీ కొట్టడం కోసం ఇంత మందినా. రెండు జాతీయ పార్టీల తీరు బాగాలేదు. ఎందుకంటే వాళ్ళు చేసేవి బాగా లేవు అన్నందుకే ఇంత తండ్లాట నన్ను ఇక్కడే అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ ఎవడి వలన కాదు నన్ను అన్నోళ్లు ఒక్కడు కూడా అడ్రెస్ లేకుండా పోయారని సీఎం దుయ్యబట్టారు.

ఈ నగరంను కాపాడాలని ప్రజలకు మనవి చేస్తున్న ఎవడేవాడో వస్తే ఆగం కావద్దు. మీ రాష్ట్రం 28వ స్థానములో ఉంది.. ఆయన వచ్చి 5స్థానంలో ఉన్న మనకు నీతులు చెప్తున్నాడు. ఈ హైదరాబాద్ లో శాంతి సామరస్యంగా ఉండాలి. పక్క రాష్ట్రం వాడు వస్తే వాంది నెత్తా కత్తా వానిది ఎం పోతుంది. వాళ్ళు వస్తారు పోతారు. మన మంత్రులు ఉన్నారు మనకు చేస్తారు కానీ నేను చేస్తా కానీ వాళ్ళు ఎవరు చేయరు. మీకు అండగా నేను ఉంటా. వలస కార్మికులకు కరోనా కాలములో అండగా టీఆరెస్ ప్రభుత్వం ఉంది వలస కార్మికులకు రైళ్లు పెట్టాం వారికి అన్నం పెట్టి అండగా ఉన్నాం. దేశములో ఎక్కడ కూడా ఇలా చేయలేదు ఎవరు. కార్మికులకు వర్తక వాణిజ్య వ్యాపారులకు నేను విజ్ఞప్తి చేస్తున్న హైదరాబాద్ శాంతియుతంగా ఉంటే మనకు ఎన్నో కంపనీ లు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చక్కగా జరుగుతుంది. అందరికి విజ్ఞప్తి చేస్తున్న శాంతియుత హైదరాబాద్ కోసం పని చేయాలి. టీఆరెస్ పార్టీకి ఓటు వేయండి హైదరాబాద్ కాపాడండి. రెచ్చగొట్టే మాటలకు ఆకర్షితం అయితే ఆగం అవుతాం. హైదరాబాద్ నగరంను ఆగం చేయకండి. హైదరాబాద్ నగరం ను బాగుచేసే బాధ్యత నాది. యువతకు ముక్యంగా వినతి చేస్తున్న భవిష్యత్తు మీది ఆలోచన చేయాలి. మాకు బాస్ లు ఢిల్లీలో లేరు మా బాస్ లు ఇక్కడే ఉన్నారు అది మిరే. మమ్మల్ని కొంతమంది దూషిస్తున్నారు. మాకు చేత కాక కాదు నేను తలుచుకుంటే మీరు నశమ అవుతారు. ఒక్కరు ఇద్దరు చిల్లర వల్లర మాటలు మాట్లాడితే పట్టించుకొం. మాకు అన్ని జెడ్పి చైర్మన్ లు ఉన్నారు. 2,3 తప్ప అన్ని మున్సిపల్ చైర్మన్ మాకే ఉన్నారు. మాకు 60 లక్షల సైన్యం ఉంది. బ్రహ్మ్డమైన మెజార్టీ రానుంది మళ్ళీ ఇక్కడే విజయోత్సవ సభ పెట్టుకుందామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.