నిందితుడిని కఠినంగా శిక్షించాలి- మంత్రి సత్యవతి రాథోడ్‌

65
Minister Satyavathi Rathod

మహబూబాబాద్‌లోని కృష్ణ కాలనీలో అపహరణకు గురైన దీక్షిత్ రెడ్డి (9)ని కిడ్నాపర్లు హత్య చేసిన విషయం తెలిసిందే. మెకానిక్ మందసాగర్ అనే వ్యక్తి బాలుడిని హత్య చేశాడని పోలీసులు ఇప్పటికే తేల్చారు. ఈ బాలుడి కిడ్నాప్, హత్యను తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్‌ తీవ్రంగా ఖండించారు. ఇటువంటి దారుణాలకు పాల్పడే వారికి సమాజంలో బతకడానికి చోటులేదని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని అన్నారు.

దీక్షిత్‌రెడ్డి కుటుంబాన్ని సత్యవతి రాథోడ్ ఈ రోజు‌ పరామర్శించారు. శనిగపురం వెళ్లిన ఆమె బాలుడి తల్లిదండ్రులు రంజిత్‌రెడ్డి, వసంతతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని చెప్పారు. వారికి తమ సర్కారు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నిందితులు సాంకేతికతను వినియోగించుకుని ఇటువంటి ఘటనలకు పాల్పడడానికి ప్రయత్నం చేయడం విచారకరమని తెలిపారు.