డోర్నకల్‌లో 150మంది నిరుపేద ముస్లింలకు రంజాన్ సందర్భంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మంత్రి సత్యవతి రాథోడ్. ఈ కార్యక్రమంలో జడ్పి చైర్పర్సన్ బిందు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ: కరోనాతో ప్రపంచం విలవిలాడుతోంది.రెండు నెలలుగా రాష్టానికి 30 వేల కోట్ల ఆదాయం కోల్పోయింది.రాష్ట్రంలో రంజాన్‌తో పాటు అన్ని పండుగలకు,మతాల వారికి ప్రభుత్వ సహాయం అందేది, కానీ కరోనా మహమ్మారితో అంతరాయం కలిగిందని మంత్రి అన్నారు.
30 లక్షల మంది వలస కూలీలను పూట పస్తులేకుండా సీఎం కేసీఆర్ 500 నగదు,12 కిలోల బియ్యం సమకూర్చారు.డోర్నకల్ చివరి ఆయకట్టుకు కాళేశ్వరం జలాలు చేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది. స్థానిక ఎమ్మెల్యే రెడ్యానాయక్‌తో కలిసి నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం. అల్లా దయతో కరోనా నుండి ప్రజానీకానికి విముక్తి కలగాలని ప్రార్థిస్తున్నా అని మంత్రి పేర్కొన్నారు.