240కి పైగా దేశాల్లో స‌త్య‌దేవ్ ‘కృష్ణ‌మ్మ‌’

10
- Advertisement -

వెర్స‌టైల్ యాక్ట‌ర్ స‌త్య‌దేవ్ కంచ‌ర్ల తాజా చిత్రం ‘కృష్ణ‌మ్మ‌’. ఈ రా అండ్ రస్టిక్ యాక్షన్ డ్రామాను వి.వి.గోపాలకృష్ణ తెరకెక్కించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కృష్ణ కొమ్మలపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ బూరుగుల‌, ల‌క్ష్మ‌ణ్ మీసాల‌, నంద గోపాల్‌, హ‌రిబాబు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ప్ర‌స్తుతం 240దేశాల‌కు పైగా అమెజాన్ ప్రైమ్‌లో ‘కృష్ణ‌మ్మ‌’ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది.

కృష్ణా న‌ది ఒడ్డున ఉండే విజ‌య‌వాడ ప‌ట్టణంలో ముగ్గురు అనాథ‌లు శివ(కృష్ణ‌), భ‌ద్ర (స‌త్య‌దేవ్‌), కోటి (ల‌క్ష్మ‌ణ్ మీసాల‌) పెరిగి పెద్ద‌వుతారు. వీరి మ‌ధ్య చ‌క్క‌టి అనుబంధం ఉంటుంది. సాఫీగా సాగిపోతున్న వీరి జీవితాల్లో ఓ ఘ‌ట‌న కార‌ణంగా అనుకోని స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. జీవితాలు ఎన్నో ఒడిదొడుకుల‌ను ఎదుర్కొంటాయి. చిన్న‌త‌నంలో జైలుకి వెళ్లిన శివ, అక్క‌డి నుంచి వ‌చ్చాక నిజాయ‌తీగా జీవితాన్ని వెల్ల‌దీయాల‌నుకుంటాడు. ముగ్గురి స్నేహితుల్లో భ‌ద్ర‌, కోటిల‌కు డ‌బ్బులు అవ‌స‌రం అవుతాయి. దాంతో వాళ్లు గంజాయి స్మ‌గ్లింగ్ చేయాల‌నుకుని పోలీసుల‌కు చిక్కుతారు. అదే స‌మ‌యంలో ఓ ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌ని చేయ‌టానికి సిద్ధ‌మ‌వుతారు. దీని కార‌ణంగా వాళ్ల జీవితాల్లో ఊహించ‌ని ఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి. ఆ ప‌ర్యావ‌సానాల‌ను వాళ్లు ఎలా ఎదుర్కొన్నారు.. చివ‌ర‌కు ఏమైంద‌నేదే కృష్ణ‌మ్మ సినిమా.

మే నెల‌లో థియేట‌ర్స్‌లో విడుద‌లైన ‘కృష్ణ‌మ్మ‌’ చిత్రానికి అభిమానుల‌తో పాటు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇండియా స‌హా 240కి పైగా దేశాల్లో సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా అందుబాటులో ఉంది. ప్రేక్ష‌కులు ఈ ర‌స్టిక్ అండ్ రా యాక్ష‌న్ ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Also Read:నేటి ముఖ్యమైన వార్తలు..

- Advertisement -