గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించిన మంత్రి సత్యవతి

645
sathyavathi rathode
- Advertisement -

తన పుట్టినరోజు సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించారు మంత్రి సత్యవతి రాథోడ్. తనను గ్రీన్ ఛాలెంజ్‌కు నామినేట్ చేసిన సంతోష్‌కు థాంక్యూ చెప్పారు. మెరుగైన రేపటి సమాజం కోసం తనను గ్రీన్ ఛాలెంజ్‌లో భాగం చేసినందుకు సంతోషంగా ఉందన్నారు.

మంత్రి సత్యవతి పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ ద్వారా ఎంపీ సంతోష్ శుభాకాంక్షలు చెప్పిన సంగతి తెలిసిందే. జీవితాంతం ఆయురారోగ్యాలతో జీవించాలని …ప్రజాజీవితంలో ఎక్కువ కాలం ఉండాలి ఆకాంక్షిస్తూ బర్త్ డే సందర్భంగా మొక్కలు నాటాలని సూచించారు. ఎంపీ సంతోష్ సూచనతో గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించారు మంత్రి సత్యవతి.

తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు సత్యవతి రాథోడ్. మీ మద్దతు,దీవెనలు ఎప్పుడూ ఇలాగే ఉండాలని ఆకాంక్షించారు.

- Advertisement -