బాధితులకు ఉరిశిక్షా..సత్యవతి రాథోడ్ ఫైర్!

3
- Advertisement -

గత 9 నెలలుగా తమ భూములు ఇవ్వమని లగచర్ల రైతులు చెబూతునే ఉన్నారని సత్యవతి రాథోడ్‌ అన్నారు.లగచర్లలో అర్ధరాత్రి సమయంలో పోలీసులు సృష్టించిన అరాచకంపై బాధితులు ఢిల్లీలోని జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. సీఎం సొంత నియోజకవర్గంలో గిరిజనులపై అఘాయిత్యాలకు పాల్పడ్డారని ఆరోపించారు.

అర్ధరాత్రి కరెంట్ తీసేసి, ఇంటర్ నెట్ బంద్ చేసి మహిళలను హింసించారని.. కొట్టారని.. బూతులు తిట్టారని అన్నారు. 51 మంది రైతులపై అక్రమ కేసులు పెట్టారని.. ఊళ్లో ఉన్న మగవాళ్లంతా పారిపోయారని చెప్పారు. బీఆర్ఎస్ వారికి అండగా ఉంటుందని స్పష్టం చేశారు. కొద్ది రోజులుగా బాధితుల ఆవేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని అన్నారు. లగచర్ల బాధితులందరికీ బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని తెలిపారు.

తండ్రుల వారసత్వంగా వచ్చిన భూములను ఫార్మా కంపెనీ ఇవ్వాలని అంటున్నారని మాలోతు కవిత అన్నారు. ఫార్మా సిటీ కోసం గత ప్రభుత్వం ఇప్పటికే భూములు సేకరించిందని.. దాన్ని కాదని గిరిజనుల భూములను రేవంత్ రెడ్డి లాక్కుంటున్నాడని మండిపడ్డారు. కానీ లగచర్లలో మా తండా వాసులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా ఇబ్బంది పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read:వైసీపీ పాలనలో మహిళలపై దారుణాలు: హోంమంత్రి అనిత

- Advertisement -