కాంగ్రెస్ దాడులను అందరూ ఖండించాలి:బీఆర్ఎస్

7
- Advertisement -

సచివాలయం దగ్గర తెలంగాణ తల్లి విగ్రహం స్థానం లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినపుడే రాష్ట్ర మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం తీరని అవమానం చేసిందన్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్,. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన సత్యవతి….మహిళలకు ఈ ఎనిమిదినెలల్లో కాంగ్రెస్ చేసింది శూన్యం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రుణ మాఫీ పై రంకెలు వేస్తున్నారు ..రుణమాఫీ పై ప్రభుత్వం చెబుతున్న లెక్కలే రుణ మాఫీ పూర్తిగా కాలేదని చెబుతున్నాయన్నారు.కే సీఆర్ ,కే టీ ఆర్ పై మహిళా మంత్రులు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం అన్నారు.హరీష్ రావు క్యాంపు కార్యాలయం పై కాంగ్రెస్ దాడులను ప్రజాస్వామ్య వాదులు ఖండించాలని, హరీష్ రావు ను రాజీనామా కోరే అర్హత సీఎం కి లేదు అన్నారు.

అసెంబ్లీ సమావేశాల్లో బీ ఆర్ ఎస్ పై చేయి సాధించడం లో కే టీ ఆర్ ,హరీష్ రావు ల పాత్ర ప్రముఖంగా ఉందన్నారు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి. అందుకే సీఎం ,కాంగ్రెస్ నేతలు వారిద్దరిని కావాలని టార్గెట్ చేస్తున్నారు…కే టీ ఆర్ క్షమాపణ చెప్పినా మహిళా మంత్రులు రాజకీయం కోసమే మాట్లాడుతున్నారు అన్నారు. హరీష్ రావు లక్ష్యంగా ఆయన క్యాంపు కార్యాలయం పై దాడి చేయడం పిరికి పందల చర్య …..ఇలాంటి భౌతిక డాడులతో కాంగ్రెస్ ఏం సాధించలేదు అన్నారు. రైతు రుణ మాఫీ మేడి పండు లా మారిందని…..క్షేత్ర స్థాయిలో రుణ మాఫీ కాలేదు అని కాంగ్రెస్ నేతలే అంటున్నారు అన్నారు.

హరీష్ రావు ఒత్తిడి తో ఈ మాత్రం రుణ మాఫీ అయింది…..మహిళా కమిషన్ ద్రుష్టి పెట్టాల్సిన అంశాల పై ద్రుష్టి పెట్టడం లేదు అన్నారు. షీ టీమ్స్ నిర్వీర్యమయ్యాయి..నియోజక వర్గాల్లో కూడా ప్రతిపక్షాలపై కాంగ్రెస్ నేతలు భౌతిక దాడులు చేస్తున్నారు అన్నారు.మమ్మల్ని అవమానించిన సీఎం తో మంత్రులు మహిళా కమిషన్ సారీ చెప్పిస్తే బాగుంటుంది ..కే టీ ఆర్ క్షమాపణ చెప్పినా ఇంకా రాద్ధాంతం చేయడం సరి కాదు అన్నారు. ఆరు గ్యారంటీలు 13 హామీలపై ద్రుష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపిందన్నారు.

కేసీఆర్ హయాంలో తెలంగాణ అభివృద్ధి ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని ఎమ్మెల్సీ వాణిదేవి అన్నారు. అన్ని వర్గాలతో పాటు మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది ..చిన్న చిన్న విషయాలను పట్టుకుని ప్రజా సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం మరచిపోతుందన్నారు. కే టీ ఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాక కూడా కాంగ్రెస్ రాజకీయం దేనికి ?..హరీష్ రావు ఆఫీస్ పై దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ? అని దుయ్యబట్టారు.

Also Read:Harishrao: రేవంత్‌రెడ్డిది నోరా?,మోరా?

- Advertisement -