కవిత అరెస్ట్ వెనకుంది బీజేపీనే!

34
- Advertisement -

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఈడీ అధికారులు,బీజేపీ తీరుపై మండిపడ్డారు. కవిత అరెస్ట్ వెనకుంది బీజేపీనే అని, ఆమెను అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. సుప్రీంకోర్టులో కేసు విచార‌ణ పెండింగ్‌లో ఉండగా, ఎమ్మెల్సీ క‌విత‌ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో చెప్పాల‌న్నారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ నాయకులను భయబ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నార‌ని … ఎటువంటి ప‌రిస్థితుల్లోనూ ఇటువంటి పిట్ట బెదిరింపుల‌కు బీఆర్ఎస్ నాయ‌కులు భ‌య‌ప‌డ‌ర‌ని పేర్కొన్నారు. ఇన్ని రోజులు ప‌ట్టించుకోకుండా పార్ల‌మెంట్ ఎన్నిక‌ల ముంగిట ఎమ్మెల్సీ క‌విత‌ను అరెస్ట్ చేయ‌డమేమిట‌ని ప్ర‌శ్నించారు. ఈడీ అధికారులు చ‌ట్టానికి వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్నారు.

Also Read:ఈ చిట్కాలు పాటించండి..మీ ఆరోగ్యం పదిలం

- Advertisement -