ఓటీటీలోకి కాజల్ ‘సత్యభామ’!

8
- Advertisement -

కాజల్ అగర్వాల్ ప్రధానపాత్రలో తెరకెక్కిన చిత్రం సత్యభామ. క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఇక జూన్ 7న థియేటర్లలో విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయితే తాజాగా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్‌లలో మిస్ అయిన ఈ సినిమాను ఇప్పుడు ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయొచ్చు.

సుమన్ చిక్కాలా దర్శకత్వం వహించిన ఈ సినిమాను అవురమ ఆర్ట్స్ బ్యానర్‌పై బాబీ తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మించారు. కాజల్‌తోపాటు హీరో నవీన్ చంద్ర కూడా కీ రోల్ ప్లే చేశారు.

Also Read:Gold Price:లేటెస్ట్ ధరలివే

- Advertisement -