హరీష్‌ని కలిసిన స్వాత్మానందేంద్ర స్వామి

8
- Advertisement -

మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈరోజు హైదరాబాద్‌లోని హరీశ్ రావు గారి నివాసానికి విచ్చేసిన స్వామి వారు.. ఆయనకు ఆశీస్సులు అందజేశారు.

అనంతరం, కోకాపేట నియోపోలిస్ లోని శ్రీ రాజశ్యామల దేవస్థానంలో ఈ నెల 19న జరగనున్న ప్రభవ నామ సంవత్సర ఉగాది ఆస్థానం, అలాగే 27న జరగనున్న శ్రీరామనవమి వేడుకలకు హాజరుకావాల్సిందిగా హరీశ్ రావు గారిని స్వామి సాదరంగా ఆహ్వానించారు.

శ్రీ రాజశ్యామల అమ్మవారి కృపాకటాక్షాలు రాష్ట్ర ప్రజలందరిపై మెండుగా ఉండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఈ సందర్భంగా హరీశ్ రావు గారు ప్రార్థించారు.

Also Read:రైతు రోశయ్యకు చంద్రబాబు అభినందనలు

- Advertisement -