శశికళ @ 9234

232
Sasikala is No. 9234
- Advertisement -

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ మరోసారి జైలు పాలయ్యారు. బెంగళూరులోని పరప్పణ అగ్రహారం జైలులోని ప్రత్యేక కోర్టులో లొంగిపోయిన  శశికళ వాంగ్మూలాన్ని కోర్టు సిబ్బంది నమోదు చేసుకుంది. జైలు అధికారులు ఖైదీలుగా శశికళకు 9234, ఇళవరసికి 9235 నంబర్లు కేటాయించారు.శశికళ మూడున్నరేళ్లు శిక్ష అనుభవించనున్నారు. ఇప్పటికే ఆమె 6 నెలలు జైలులో గడిపారు.

ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని శశికళ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. సుధాకరన్‌ కోర్టులో లొంగిపోవాల్సి ఉంది. శశికళ భర్త నటరాజన్‌, అనుచరులు పరప్పణ జైలు వద్దకు భారీగా చేరుకున్నారు. ఈ సందర్భంగా పరప్పణ అగ్రహారం జైలు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళకు నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10కోట్ల జరిమానా విధించిన విషయం తెలిసిందే.

తమిళనాడు మాజీ సీఎం జయలలిత, కర్ణాటక మాజీ సీఎం యడ్యూరప్ప, మాజీ మంత్రులు గాలి జనార్దనరెడ్డి, కృష్ణయ్యషెట్టి… తదితరులు శిక్షలో భాగంగా ఈ జైలులోనే కొంతకాలం శిక్ష అనుభవించారు. 2014లో జయలలితతో కలిసి శశికళ, ఇళవరసి, సుధాకరన్‌లు 21 రోజుల పాటు ఖైదీలుగా ఉన్నారు.

- Advertisement -