2024 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ ఒడించే లక్ష్యంతో పనిచేస్తామని బీహార్ సీఎం నితీష్ కుమార్ అన్నారు. ఇందుకు గాను బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి తేవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌తో కలిసి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కోల్‌కతాలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మమతా బెనర్జీ మాట్లాడుతూ…ఈ సందర్భంగా నేను నితీష్ కుమార్‌కి ఒకే ఒక అభ్యర్థన చేస్తున్నా…జయప్రకాశ్ జీ ఉద్యమం బీహార్ నుండి మొదలైంది. మళ్లీ అక్కడి నుండే మరోసారి ఉద్యమం ప్రారంభించాలని కోరుకుంటున్నా. త్వరలో బీహార్‌లో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, కోరాం మరియు ఆ సమయంలో తీసుకునే నిర్ణయాలు ఎలా ముందుకు వెళ్లాల్లో నిర్ణయించుకుంటామని తెలిపారు. అందుకు మేమంతా ఐక్యంగా ఉన్నామనే ఈ సమావేశం సందేశం.
Also Read: షర్మిల ” రౌడీయిజం “.. పక్కా వ్యూహమేనా ?
నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవని నేను ముందే చెప్పాను. బీజేపీని జీరో చేయాలని కోరుకుంటున్నాను….వారు మీడియా సపోర్టు అబద్ధాలతో వాళ్లు పెద్ద హీరోలయ్యారు అని తెలిపారు. నితీష్ కుమార్ ప్రవేశపెట్టిన ప్రతిపాదిత ఒక సీటు-ఒక అభ్యర్థి ఫార్ములాపై చర్చించుకుంటాము. ఆలోచన దృక్పథం మరియు లక్ష్యం స్పష్టంగా ఉంటే ఎటువంటి సమస్యలు ఉండవు అని అన్నారు.
కాంగ్రెస్‌పై ప్రేమ లేని ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలనే లక్ష్యంతో నితీష్‌కుమార్ తేజస్వి యాదవ్ సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలవనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సహా భావసారూప్యత గల ప్రతిపక్ష పార్టీలతో సమావేశమయ్యేందుకు అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారని అని అన్నారు. అలాగే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే నితీష్‌కుమార్ తేజస్వియాదవ్‌ల బేటీతో దేశంలో బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని సంకేతంగా రాహుల్ అనర్హతతో సమావేశమయ్యిన సంగతి తెలిసిందే.
Also Read: రేవంత్ కన్నీరుకు కారణం కాంగ్రెసే ?