నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఆఫీస్ లలో ఎక్కువ శాతం కూర్చొని పని చేయడం వల్ల చాలా మంది వెన్ను నొప్పి సమస్యతో భాద పడుతూ ఉంటారు. ఈ వెన్ను నొప్పి కారణంగా ఎక్కువ సేపు కూర్చోలేక, నిలబడ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు చాలమంది. దాంతో ట్రీట్మెంట్ కోసం ఎన్నో ఆసుపత్రులు తిరుగుతూ మెడిసన్ వాడుతూ ఉంటారు. అయితే యోగాలో ఈ వెన్ను నొప్పిని దూరం చేసే కొన్ని ఆసనాలు ఉన్నాయి. వాటిలో సర్పాసనం ద్వారా వెన్నునొప్పికి చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ ఆసనాన్నే భుజంగాసనం అని కూడా అంటారు. .
ఈ ఆసనం ద్వారా వెన్నెముక సమస్యలు దూరం అవ్వడం మాత్రమే కాకుండా.. ఇంకా చాలా రకాల ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది. సర్పాసనం ద్వారా వెన్నెముకలోని వెన్నుపూసలన్నిటికి మరియు మెదడుకు దగ్గరగా ఉన్న నరాలకు సక్రమంగా రక్త ప్రసరణ జరుగుతుంది. తద్వారా నాడీ వ్యవస్థ చైతన్యవంతం అవుతుంది. ఇక ఈ ఆసనం ద్వారా ఉదరంలోని నరాలకు బిగింపు రావడంతో అక్కడ ఉన్న అవయవాలకు శక్తి లభిస్తుంది. తద్వారా మలబద్దకం వంటి సమస్యలు దూరం అవుతాయి. స్త్రీలలో గర్భాశయం, అండాశయం ఆరోగ్యంగా మారుతాయి. ఋతుక్రమ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి. కఫము పైత్యం గల వారికి ఈ ఆసనం ద్వారా చక్కటి పరిస్కారం లభిస్తుంది.
సర్పాసనం వేయు విధానం
ముందుగా నేలపై దుప్పటి లేదా యోగా షీట్ పరచుకొని దానిపై పొట్ట ఆధారంతో బోర్లపడుకోవాలి. ఆ తరువాత రెండు కాళ్ళ యొక్క వేళ్ళను వెనుకకు ఉంచి పోటోలో చూపిన విధంగా చేయాలి. రెండు చేతులను తలపైపునాకు పొడిగించాలి. తల మరియు నడుమును పైకి లేపి ఎంత వీలైతే అంతా వెనుకవైపునకు వంచాలి. దాంతో శరీరం యొక్క బరువంత చేతులపై పడుతుంది. వెన్నెముక యొక్క చివరి భాగంపై ఒత్తిడి కెంద్రీకృతం అవుతుంది. ఈ ఆసనం వేసినప్పుడు శ్వాస క్రియ నెమ్మదిగా జరిగించాలి. ఇక ప్రతిరోజూ ఒకే విధంగా ఈ ఆసనం 8-10 మార్లు 20-30 నిముషాల పాటు ఈ ఆసనం వేయాలి.
Also Read: Look Back 2024:ఈ హీరోలకు అస్సలు కలిసిరాలేదు!