ప్రభుత్వ పాఠశాలకు బస్ కొనిచ్చిన సర్పంచ్..

198
sarpanch
- Advertisement -

సాధారణంగా రాజకీయ నాయకులు అంటేనే.. ప్రభుత్వ ఖజానాను దోచుకునే నాయకులు. నేటి కాలంలో ప్రభుత్వం నిధులను దోచుకునే నాయకులే ఉన్నారు కానీ ప్రజల ఇబ్బందులను అర్థం చేసుకునే నాయకులు చాలా అరుదు. కానీ ఓ గ్రామ సర్పంచ్ మాత్రం మంచి తననానికి నిదర్శనంగా నిలిచారు. సూర్యపేట జిల్లాలోని మఠంపల్లి మండలం చౌటపల్లి గ్రామ్ సర్పంచ్ చేసిన పనికి ఆ ఊరు ప్రజలే, కాదు పక్క ఊళ్ల ప్రజలు కూడా ఆయనని ప్రశంసిస్తున్నారు.

ఐదు కిలో మీటర్ల దూరంలో త్రివేణినగర్, బక్కమంతులగూడెం విద్యార్థులు చౌటపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వస్తుంటారు. సుమారు 250 మందికి పైగా విద్యార్థులు ఐదు కిలో మీటర్ల దూరం నుంచి నడుచుకుంటు వస్తూ చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పిల్లల ఇబ్బందిని గమనించిన చౌటపల్లి సర్పంచ్ నలబోలు భవానీ వెంకట్ రెడ్డి రూ.4 లక్షలు ఖర్చు చేసి ఓ బస్సును ఏర్పాటు చేశారు. నేడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజీవరెడ్డి బస్సును ప్రారంభించారు. తన సొంత డబ్బుతో బస్సును ఏర్పాటు చేసిన సర్పంచ్ కి ఊరు ప్రజలు అభినందిస్తున్నారు.

- Advertisement -