అమెజాన్‌ ప్రైమ్‌లో సర్కారు వారి పాట!

25
mahesh

పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ బాబు – కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. ప్రపంచవ్యాప్తంగా గురువారం ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. మిక్స్‌ డ్ టాక్‌ సొంతం చేసుకున్న తొలిరోజు కొన్ని ఏరియాల్లో సరికొత్త రికార్డులు సృష్టించింది.

ఇక సినిమా విడుదలై తొలి రోజు పూర్తయిందో లేదో డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. అమెజాన్ ప్రైమ్ లో జూన్ రెండో వారం లేదా మూడో వారం నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

యశ్ హీరోగా నటించిన ‘కెజియఫ్: చాప్టర్-2’ రైట్స్‌ను అమెజానే సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రెండు పెద్ద సినిమా రైట్స్‌ను సొంతం చేసుకున్న అమెజాన్‌…మరిన్ని సౌత్ సినిమా హక్కులను దక్కించుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది.