న్యూఇయర్ కానుకగా సర్కారు నౌకరి

44
- Advertisement -

ప్రముఖ సింగర్ సునీత కుమారుడు ఆకాష్ హీరోగా పరిచయవుతున్న సినిమా “సర్కారు నౌకరి”. ఈ చిత్రంలో భావన హీరోయిన్ గా నటిస్తోంది. సర్కారు నౌకరి చిత్రాన్ని ఆర్కే టెలీ షో బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నారు. గంగనమోని శేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. “సర్కారు నౌకరి” సినిమాను న్యూఇయర్ సందర్భంగా వచ్చే జనవరి 1న థియేటర్స్ లో ఘనంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

సోషల్ డ్రామా కథతో ఆద్యంతం ఆకట్టుకునేలా “సర్కారు నౌకరి” సినిమాను రూపొందించారు దర్శకుడు గంగనమోని శేఖర్. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు గారి ఆర్కే టెలీ షో బ్యానర్ సిల్వర్ జుబ్లీ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నిర్మాణం కావడం విశేషం. ఈ సినిమా రాఘవేంద్ర రావు శైలి కి భిన్నంగా గా ఉంటూనే ఇప్పటి జనరేషన్ అభిరుచులకు తగ్గట్లు ఉంటుందని అంటున్నారు మేకర్స్.

“సర్కారు నౌకరి” సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన లిరికల్ సాంగ్స్ తో పాటు టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా కూడా థియేటర్స్ లో ప్రేక్షకుల్ని ఇలాగే ఆకట్టుకుంటుందని మూవీ టీమ్ ఆశిస్తున్నారు.

Also Read:ప‌న‌స పండ్లు ఎక్కువ‌గా తింటున్నారా?

- Advertisement -