సర్కార్-3 ఫస్ట్ లుక్‌..

294
- Advertisement -

అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్రలో ఆర్జీవీ దర్శకత్వంలో వచ్చిన సర్కార్‌, సర్కార్‌ 2 చిత్రాలు బాలీవుడ్‌లో విజయవంతమయ్యాయి. తాజాగా సర్కార్‌ 3 చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆర్‌జీవీ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా తెలిపారు. ఈ చిత్రంలో నటించబోయే యాక్టర్లను ఆర్జీవీ ప్రకటించారు. ముందు చిత్రాల్లోలాగా అమితాబ్‌ బచ్చన్‌ ప్రధాన పాత్ర పోషిస్తుండగా సర్కార్‌ 3లో అభిషేక్‌, ఐశ్వర్యలు లేకపోవడం గమనార్హం.

amithab

ఈ చిత్రంలోని పాత్రలన్నింటిని ఒకేసారి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వర్మ పరిచయం చేశారు. సుభాష్ నాగే పాత్రలో మళ్లీ అమితాబ్ బచ్చనే కనిపిస్తారని, జాకీష్రాఫ్ కూడా అదే లుక్ లో కనిపించనున్నారని వర్మ పేర్కొన్నారు. ‘సర్కార్ 3’లో కొత్తగా కనిపించే పాత్రల విషయానికొస్తే .. గోవింద్ దేశ్ పాండే పాత్రలో మనోజ్ బాజ్ పాయ్, సర్కార్ కుడిభుజంగా, నమ్మిన బంటు పాత్రలో రోనిత్ రాయ్, సర్కార్ సినిమాలో జులాయి కొడుకు విష్ణు ఉంటాడు. ప్రధాన విలన్ పాత్రల్లో జాకీష్రాఫ్, భరత్ ధబోల్కర్, లేడీ విలన్ పాత్రలో రుక్కుబాయ్ దేవిగా రోహిణి హట్టంగడి కనిపించనున్నారు. తన తండ్రిని చంపిన సర్కార్ పై పగ తీర్చుకునే అన్ను కర్కరే పాత్రలో నటి యామి గౌతమ్ కనిపించనున్నట్లు వర్మ పేర్కొన్నారు.

Cu5I1bVWIAAt3SB Cu5MHX0WYAAC-YP Cu5P3vkXYAAQmgB Cu5T0tiWAAAEafx Cu5VZgqWIAAqDoB Cu5WrSHWcAAob80 Cu5Y_YnXEDYx8WO

- Advertisement -