‘సరిపోదా శనివారం’కి అదిరే రెస్పాన్స్..

8
- Advertisement -

నేచురల్ స్టార్ నాని, క్రియేటివ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ బ్లాక్ బస్టర్ మూవీ ‘సరిపోదా శనివారం’. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా, SJ సూర్య పవర్ ఫుల్ రోల్ నటించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి హై బడ్జెట్‌, భారీ కాన్వాస్‌తో నిర్మించారు. ఆగస్ట్ 29న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని, హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా సినిమాకి చార్ట్ బస్టర్ మ్యూజిక్ అందించిన సెన్సేషనల్ కంపోజర్ జేక్స్‌ బెజాయ్‌ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

‘సరిపోదా శనివారం’ మ్యూజిక్ అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. బీజీఎంని ఆడియన్స్ చాలా ఎంజాయ్ చేస్తున్నారు.. ఎలా అనిపిస్తోంది ?
-మలయాళం, తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో ఇప్పటివరకూ అరవైకి పైగా సినిమాలు చేశాను. ఏ సినిమాకి రానంత ప్రేమ, రెస్పాన్స్ ఇప్పుడు ఈ సినిమాతో వచ్చింది. కంటిన్యూగా మెసేజులు వస్తున్నానే వున్నాయి. అద్భుతంగా వుందని చెబుతున్నారు. ప్రేక్షకులని ఎంటర్ టైనర్ చేస్తే ఎంత లవ్ ఇస్తారో ఈ సినిమాతో చూశాను. ఈ సక్సెస్ చాలా ఆనందాన్ని ఇచ్చింది.

‘సరిపోదా శనివారం’ కథలో మీకు ఎక్సయిట్ చేసిన ఎలిమెంట్ ఏమిటి ?
-దుల్కర్ తో చేసిన ‘కింగ్ ఆఫ్ కొత్త తర్వాత ఈ సినిమా కథ విన్నాను. నాని గారికి, డైరెక్టర్ వివేక్ ఆత్రేయకి ఆ సినిమా ట్రాక్స్ నచ్చాయి. వివేక్ ‘సరిపోదా శనివారం’ కథ చెప్పినప్పుడు చాలా కొత్తగా ఎక్సైటింగ్ గా అనిపించింది. చాలా బ్యూటిఫుల్ కమర్శియల్ లైన్ ఇది. ముఖ్యంగా విలన్ క్యారెక్టర్ ఆర్క్ వండర్ఫుల్ గా ఉంది. కథ విన్నప్పుడే అరిదిపోయిందనిపించింది. వివేక్ కన్విక్షన్ నన్ను ఎక్సయిట్ చేసింది.

-మొదట అనౌన్స్ మెంట్ వీడియో గా అన్ అన్ చైన్డ్ ట్రాక్ చేశాం. దానికి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అదొక సూపర్ హీరో మూడ్ వచ్చింది. తర్వాత నాని గారు, సూర్య బర్త్ డేస్ కి రిలీజైన స్పెషల్ ట్రాక్స్ కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ థీమ్స్ ఈ సినిమా ఎలా వుంటుందో ప్రజెంట్ చేశాయి. ఇవన్నీ ఆడియన్స్ కి ముందే రిజిస్టర్ అయ్యాయి. దీంతో నా వర్క్ ఇంకా ఈజీ అయ్యింది. గరం గరం, ఉల్లాసం, సరిమప, భగ భగ నెంబర్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది.

హీరో కి ఈక్వెల్ గా విలన్ కి ట్రాక్ కి మ్యూజిక్ చేయడం గురించి?
-ఈ కథ విన్నప్పుడే దయా క్యారెక్టర్ నన్ను ఎక్సయిట్ చేసింది. తన క్యారెక్టర్ ఆర్క్ అదిరిపోయింది. సూర్య గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. క్యారెక్టర్ ఆర్క్ ని బట్టి మ్యూజిక్ అంత మ్యాగ్నటిక్ గా వచ్చింది. ఇంటర్వెల్ బ్యాంగ్ లో డైలాగ్స్ వుండవు. బీజీఎంలోనే హై మూమెంట్ వుంటుంది. క్లాక్ బాయ్ మూమెంట్ లో ఆడియన్స్ మ్యూజిక్ లో హైని చాలా ఎంజాయ్ చేస్తున్నారు.

చాలా రివ్యూస్ లో బీజీఎంకు ఎక్కువ ప్రసంశలు రావడం ఎలా అనిపించింది ?
-చాలా హ్యాపీగా వుంది. ఈ సినిమా రైటింగ్ చాలా స్ట్రాంగ్ వుంది. నాని గారు, సూర్య గారు అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మదర్ సెంటిమెంట్, ఫాదర్ సెంటిమెంట్, సిస్టర్ సెంటిమెంట్, విలన్ బ్రదర్స్ సెంటిమెంట్.. ఇవన్నీ చక్కగా బ్లెండ్ అయ్యాయి. దీంతో ఆడియన్స్ మ్యూజిక్ లో హై కనెక్ట్ అయ్యారు. డైరెక్టర్ వివేక్ జీనియస్. ఈ మధ్యకాలంలో నేను పని చేసిన బెస్ట్ కమర్షియల్ సినిమా ఇది.

వివేక్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?
-తను హాఫ్ మ్యూజిక్ డైరెక్టర్.(నవ్వుతూ) వివేక్ చాలా మ్యూజికల్. తను మ్యూజిక్ విషయంలో చాలా పర్టిక్యులర్ గా వుంటారు. తనకి మ్యూజిక్ , ప్రోగ్రామింగ్ విషయంలో క్లియర్ విజన్ వుంటుంది. తన సినిమాకి ఎలాంటి సౌండ్ కావాలో క్లారిటీ వున్న దర్శకుడు. నాకు చాలా హెల్ప్ ఫుల్ గా వున్నారు. తను లిరిక్స్ విషయంలో చాలా పర్టిక్యులర్. ఎక్కడా రాజీపడరు.

Also Read:సిద్దిపేట నుండి ఖమ్మంకు నిత్యావరసర సరుకులు..

ఈ సినిమా రిలీజ్ తర్వాత ఇండస్ట్రీ నుంచి అందుకున్న కాంప్లిమెంట్ ?
-డైరెక్టర్ మారుతి గారు కాల్ చేసి’మ్యూజిక్ ఆదరగొట్టావ్’ అన్నారు. ఆయనకి సినిమా చాలా నచ్చింది. మ్యూజిక్, రైటింగ్ ని చాలా మెచ్చుకున్నారు.

డివివి ఎంటర్‌టైన్‌మెంట్ గురించి ?
-డివివి ఎంటర్‌టైన్‌మెంట్ ఫెంటాస్టిక్ ప్రొడక్షన్ హౌస్. దానయ్య గారు చాలా సపోర్ట్ చేశారు.

క్లాసిక్, వెస్ట్రన్ లో ఏ దేనిని ఎక్కువగా ఇష్టపడతారు?
-ఫిల్మ్ కంపోజర్ అన్నిటిని ఇష్టపడాలి. నేను చిన్నప్పుడు క్లాసికల్ నేర్చుకున్నాను. యూఎస్ లో వెస్ట్రన్ ఫిల్మ్ స్కోరింగ్ చదువుకున్నాను. ఒక కంపోజర్ కి అన్నీ జోనర్స్ పై అవగాహన ఉంటేనే ఫిల్మ్ స్కోర్ చేయడం సాధ్యపడుతుంది.

మీ మ్యూజిక్ గోల్ ఏమిటి ?
-ఫిల్మ్ మ్యూజిక్ కంటిన్యూ చేస్తాను. ఇండిపెండెంట్ మ్యూజిక్ చేయాలని వుంది.

ఈ మధ్య కాలంలో క్యాచి సాంగ్స్, వైరల్ సాంగ్స్ ఇవ్వడంపైనే అందరూ ఫోకస్ చేస్తున్నారు కదా?
-ఇన్స్టా గ్రామ్ ఎరాలో వున్నాం. క్యాచి కంటెంట్ ఇచ్చి ఎట్రాక్ట్ చేయాల్సిందే. ఆడియన్స్ అభిరుచికి తగ్గ మ్యూజిక్ ఇవ్వాలి. అలాగని మన మ్యూజిక్ లో సోల్ మిస్ కాకూడదు. సోల్ వున్న మ్యూజిక్ చాలా కాలంలో నిలుస్తుంది.

మ్యూజిక్ పరంగా తెలుగు, మలయాళంకు ఎలాంటి తేడా వుంది ?
-మ్యూజిక్ విషయంలో అన్ని భాషల్లో ఒకటే అప్రోచ్ వుంటుంది. కంటెంట్ ని బట్టే మ్యూజిక్ వుంటుంది.

‘సరిపోదా శనివారం’ సక్సెస్ తర్వాత తెలుగు నుంచి నిర్మాతలు సంప్రదించారా ?
-చాలా కాల్స్ వచ్చాయి. మీటింగ్స్ వున్నాయి. నా కమిట్మెంట్స్ ని బట్టి ఫిల్టర్ చేసుకోవాలి.

తెలుగులో ఈ మధ్య కాలంలో నచ్చిన ఆల్బమ్స్ ?
-కల్కి చాలా నచ్చింది. మిక్కీ జే మేయర్, తమన్ తో పాటు చాలా కంపోజిషన్స్ వింటాను.

తెలుగులో చేస్తున్న సినిమాలు ?
-విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ రాబోతోంది.

- Advertisement -