సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఈసినిమాలో మహేశ్ బాబు ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. ఈమూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్రయూనిట్. ఈ టీజర్ కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక డిసెంబర్ నెలలో ప్రతి సోమవారం ఈమూవీ నుంచి ఒక సాంగ్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు చిత్రబృందం.
చివరి సోమవారం రోజున ఒక సాంగ్ ను విడుదల చేశారు. వచ్చే సోమవారం అంటే డిసెంబర్ 9న మరో సాంగ్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ వారం సూర్యుడివో చంద్రుడివో అనే పాటను రిలీజ్ చేయనున్నట్లు పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మహేశ్ బాబు విజయశాంతి ఇంకా పలువురు పొలాల్లో తిరుగుతూ ఉన్నారు. ఈ ఫోటోని బట్టి చూస్తే ఈసాంగ్ రైతులకు సంబంధించినదిగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈమూవీలో విజయశాంతి ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రాన్ని సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 11న విడుదల చేయనున్నారు.