మహేష్‌ ‘సరిలేరు నీకెవ్వరు’ సరికొత్త రికార్డు..!

617
mahesh
- Advertisement -

టాలీవుడ్‌ ప్రిన్స్‌ మహేష్‌ బాబు తాజాగా నటించిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న మహేష్‌కు జోడీగా నటించింది. ఇందలో ఓ కీలక పాత్రలో లేడీ సూపర్‌ స్టార్‌ విజయశాంతి నటించారు. సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 11న విడుద‌లైన ఈ చిత్రం బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ టాక్‌తో బాక్సాఫిస్‌ వద్ద భారీ వ‌సూళ్ల‌ను సాధిస్తుంది. ఈ మూవీని దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌, ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్స్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించారు.

sarileru

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఒక రేంజ్‌లో దూసుకుపోతోంది. ఐదు రోజులకుగాను ఈ సినిమా 68.22కోట్ల షేర్‌ను వసూలు చేసింది. ముఖ్యంగా నైజామ్‌లో రికార్డుస్థాయి వసూళ్లను రాబడుతోంది. ఐదు రోజులకుగాను ఈ సినిమా నైజామ్‌లో 22.5 కోట్ల షేర్‌ను రాబట్టింది. నైజామ్ ఏరియాలో మహేష్‌ బాబు సినిమాల్లో ఇంతవరకూ అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ‘మహర్షి’ రికార్డును నెలకొల్పింది. ఆ రికార్డును ‘సరిలేరు నీకెవ్వరు’ అధిగమించడానికి ఎంతో సమయం పట్టదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మ‌హేష్‌ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సాధించే దిశ‌గా స‌రిలేరు నీకెవ్వ‌రు ప‌రుగులు తీస్తోంది.

నైజాంలో రూ.22.5 కోట్లు(నాన్ బాహుబ‌లి రికార్డ్‌),ఉత్త‌రాంధ్ర‌… రూ.10.05 కోట్లు( బ్రేక్ ఈవెన్‌),సీడెడ్‌… రూ.9.75 కోట్లు,గుంటూరు… రూ.7.19 కోట్లు(బ్రేక్ ఈవెన్‌), ఈస్ట్ గోదావ‌రి… రూ.6.22 కోట్లు (బ్రేక్ ఈవెన్‌, నాన్ బాహుబ‌లి రికార్డ్‌),కృష్ణా.. రూ.5.55 కోట్లు,వెస్ట్ గోదావ‌రి… రూ.4.54 కోట్లు(ఆల్ టైమ్ రికార్డ్‌),నెల్లూరు… రూ.2.42కోట్లు (బ్రేక్ ఈవెన్, నాన్ బాహుబ‌లి రికార్డ్‌)వసూలు చేసింది.

- Advertisement -