- Advertisement -
అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు మీకెవ్వరు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకురానుంది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇండియన్ ఆర్మీకి నివాళి అర్పించింది చిత్రయూనిట్.
73వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలతో టైటిల్ సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేసింది. దేవి శ్రీ సంగీత సారధ్యంలో రూపొందిన ఈ సాంగ్ రోమాలు నిక్కపొడుచుకునేలా ఉంది.
ఈ మూవీలో మహేష్…మేజర్ అజయ్ కృష్ణగా కనిపించనున్నారు. మహేశ్ సరసన రష్మీక మందన హీరోయిన్ గా నటించగా ఇటివలే హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటిలో సెకండ్ షెడ్యూల్ జరుపుకుంటుంది. బండ్ల గణేష్, విజయశాంతితో పాటు పలువురు సినీ నటులు నటిస్తున్నారు.
- Advertisement -