అనిల్ రావిపూడి ఇంట్లో సంబరాలు..ఎందుకో తెలుసా?

468
Anil Ravipudi
- Advertisement -

ప్రముఖ దర్శకుడు అనిల్ అనిపూడి తండ్రి అయ్యాడు. అనిల్ రావిపూడి భార్య భావని ఈ రోజు ఉదయం పండంటి బాబుకు జన్మనిచ్చింది. దీంతో సంక్రాంతికి ముందే అనిల్ రావిపూడి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఈ జంటకు ఇప్పటికే శ్రేయాస్వి అనే కుమార్తె ఉండగా రెండవ సంతానంగా కుమారుడు జన్మించాడు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు దర్శుకుడు అనిల్ రావిపూడికి విషెస్ తెలియజేస్తున్నారు. ఈసందర్భంగా ట్వీట్టర్ ద్వారా విషెస్ తెలియజేశారు సూపర్ స్టార్ మహేశ్ బాబు.

అనిల్ దంపతులు ఇప్పుడు చాలా గర్వపడుతుంటారని అన్నారు. వారి కుటుంబంపై దేవుని ఆశీస్సులు సదా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాగా అనిల్ రావిపూడి మహేశ్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రం ఈనెల 11న విడుదల కానుంది. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. లేడి అమితాబ్ విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈచిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

- Advertisement -