నా భార్య పేరు మిసెస్ శరత్ కుమార్……

275
Sarath Babu called to miss Sarath Kumar
- Advertisement -

తెలుగు చలన చిత్రలో  తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న నటుడు శరత్‌బాబు. తెలుగునాట టాప్ స్టార్స్ నటించిన పలు చిత్రాల్లో శరత్ బాబు కీలక పాత్రలు ధరించి అలరించారు… గతంలో ‘మగధీర’, ‘నాగవల్లి’లోనూ శరత్ బాబు తన అభినయంతో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయనకు అంతగా అవకాశాలు రావట్లేదనే చెప్పుకోవాలి.

శరత్‌బాబు నటుడిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారో….తన వ్యక్తిగత జీవితంలో మూడుపెళ్లిలు చేసుకుని వార్తల్లోకి ఎక్కారు. గతంలో శరత్ బాబు ప్రముఖ నటి రమా ప్రభను, స్నేహ లతా దీక్షిత్ లను పెళ్లాడారు….ఆ తర్వాత ఈ ఇద్దరితోనూ ఆయన విడిపోయారు.
Sarath Babu called to miss Sarath Kumar
అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో శరత్‌బాబుకు తన వివాహానికి సంబంధించిన ప్రశ్న ఎదురు కాగా… తన భార్య పేరును ఉచ్ఛరించడానికి కూడా తాను ఇష్టపడనని, తన భార్య పేరు మిసెస్ శరత్ కుమార్ మాత్రమే అని చెప్పారు. జీవితంలో చోటు చేసుకునే ఎన్నో సంఘటనల్లో పెళ్లి కూడా ఒక సంఘటనే అని, కొన్ని సంఘటనలు జీవిత కాలం ఉంటాయి… కొన్ని మాత్రం కాలగర్భంలో కలసిపోతుంటాయి అని చెప్పుకొచ్చారు.

అంతేకాకుండా శరత్‌బాబును మీకు ఎంత మంది పిల్లలు అని చాలా మంది తనను అడుగుతుంటారని… తనకు పాతిక మంది పిల్లలు అని చెబుతుంటానని శరత్ బాబు అన్నారు. “అవును నిజమే. మా అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ల పిల్లలందరూ కలిపి పాతిక మంది ఉంటారు. వారంతా కూడా నా పిల్లలే కదా” అని శరత్ బాబు చెప్పారు. తాను పూర్తిగా శాకాహారమే తీసుకుంటానని శరత్ బాబు అన్నారు.
Sarath Babu called to miss Sarath Kumar
అయితే ఇటీవలే శరత్‌బాబు మొదటి భార్య రమాప్రభ ఆ మధ్య ఓ ఇంటర్వ్యేల్లో శరత్‌బాబుపై సంచలన ఆరోపణలు చేసారు. ప్రేమ వివాహం చేసుకున్న  ఈ ఇద్దరూ కలిసి 16 ఏళ్ళు కలిసి కాపురం చేసి…తర్వాత విబేధాలతో విడిపోయారు. ప్లాన్డ్ గా తన ఆస్తి అంతా రాయిన్చుకొని ఒక పథకం ప్రకారం విడాకులు తీసుకున్నాడని రమా ప్రభ ఈ ఇంటర్వ్యూలో ఆరోపించారు.

- Advertisement -