కాళేశ్వరంలో సరస్వతీ పుష్కరాలను అధికారికంగా ప్రారంభించారు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. త్రివేణి సంగమంలో తొలి స్నానం ఆచరించారు మధనానంద సరస్వతి స్వామి. పుణ్య స్నానాల కోసం కాళేశ్వరానికి భారీగా చేరుకున్నారు భక్తులు. 15 న ప్రారంభమై 12 రోజులపాటు (26 వ తేదీ) కొనసాగనున్నాయి సరస్వతీ పుష్కరాలు. 6 రాష్ట్రాల నుంచి సుమారు 50 లక్షల మంది వస్తారని అంచనా వేశారు అధికారులు.
పూర్వ కాలంలో పుష్కరుడు అనే బ్రా హ్మణుడు శివుని కోసం తపస్సు చేస్తాడట ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యేక్షమై ఏదైన వరం కోరుకోమని అడుగు తాడు. అందుకు పుష్కరుడు ఓ దేవా జీవులు చేసిన పాపాల తో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి. నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని నా శరీర స్పర్శచే పునీతమ య్యేట్లు వరం ఇవ్వమని కొరుకుంటాడు. అప్పుడు శివుడు, నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థం అవుతుందని, ఆ నదీలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవు తారని వరం ఇచ్చినట్లు పురాణ గాథలు స్పష్టం చేస్తున్నా యి.
బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున12 రాశుల్లో సంచరిస్తుంటాడు. తొలి 12 రోజులను ఆది పుష్కరాలుగా చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా పరిగణించి పుష్కర వేడుకలను నిర్వహిస్తుం టారు. దేశంలోని 12 నదులకు ఒక్కో పుష్కరాలు ఉండనుండగా ముక్తీశ్వర లింగానికి వున్న నాసిక రంద్రాలగుండా ఎంత నీరు పోసినా బయటికి రాకుండా భూమార్గంలో ప్రవహించి సరస్వతి నదిరూపంలో గోదావరి, ప్రాణహిత నదులతో కలిసి త్రివేణి సంగమంగా ఏర్పడిందనేది ప్రసిద్ధి.
Also Read:లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే!

